Olympics 2028 : ఒలింపిక్స్‌లో వందలకొద్దీ పతకాలు కొల్లగొట్టే దేశాలు చాలానే. అథ్లెటిక్స్ నుంచి టేబుల్ టెన్నిస్ వరకూ ప్రతి పోటీలో స్వర్ణం సాధించే ఆసియా దేశం చైనా(China) ఈసారి క్రికెట్ మీద గురి పెట్టింది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్(Los Angles) వేదికగా జరుగబోయే విశ్వక్రీడల్లో ఏకంగా పసిడి పతకంమే లక్ష్యంగా పెట్టుకుందట చైనా. అందుకోసం క్రికెట్ టీమ్‌ను సిద్ధం చేస్తోంట. ఈ విషయాన్ని ఆదివారం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా(Steve Waugh) వెల్లడించాడు.
‘దాదాపు శతాబ్దం తర్వాత క్రికెట్‌కు మళ్లీ ఒలింపిక్స్‌లో చోటు దక్కనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించడమే ఆలస్యం అన్ని దేశాలు సన్నాహాల్లో మునిగిపోయాయి. ఆసియా దేశం చైనా కూడా క్రికెట్ టీమ్‌ను సిద్దం చేసుకుంటోంది. ఈరోజుల్లో టీ20లకు ఆదరణ చాలా ఉంది. ఫ్రాంచైజ్ క్రికెట్ ద్వారా ఏటా వందల కోట్ల వ్యాపారం సాగుతోంది. ఈ టీ20 బిజినెస్ మరింత పెరగనుంది’ అని స్టీవ్ వా తెలిపాడు.
Bold prediction by Steve Waugh#LAOlympicshttps://t.co/4agPV6TIaY
— Times Now Sports (@timesnowsports) April 27, 2025
విశ్వక్రీడల్లో 128 ఏళ్ల తర్వాత క్రికెట్ పునరాగమనం చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. పురుషులు, మహిళల విభాగంలో ఆరేసి జట్లు స్వర్ణం కోసం పోటీపడనున్నాయి. దాంతో, అన్ని దేశాలు ఒలింపిక్ పతకంపై కోసం సన్నద్ధమవుతున్నాయి. ఒలింపిక్స్‌లో ప్రతి పోటీలో పతకాల పంట పండించే చైనా.. క్రికెట్ టీమ్‌తో గోల్డ్ మెడల్ సాధిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 2028లో జూలై 14న లాస్ ఏంజెల్స్‌లో ఒలిపింక్స్ పండుగ మొదలవ్వనుంది.