IPL 2025 : వాంఖడేలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు వీరకొట్టుడు కొట్టారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లను ఉతికేస్తూ ఓపెనర్ రియాన్ రికెల్టన్(58) హాఫ్ సెంచరీతో మెరుపు ఆరంభం ఇవ్వగా 10 ఓవర్లకే ముంబై స్కోర్ 105కు చేరింది. అయితే.. లక్నో బౌలర్లు పుంజుకొని వరుసగా వికెట్లు తీసినా.. సూర్యకుమార్ యాదవ్(54) తనవైన షాట్లతో అలరించాడు. ఆఖర్లో నమన్ ధిర్(25 నాటౌట్), కార్బిన్ బాస్చ్(20)లు ధనాధన్ ఆడి ముంబై స్కోర్ 200 దాటించారు. అవేశ్ ఖాన్ వేసిన 20వ ఓవర్లో ఆఖరి బంతిని నమన్ స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.
ఐపీఎల్ 18వ సీజన్ మూడో వారం నుంచి రెచ్చిపోతున్న ముంబై ఇండియన్స్ మరో విజయంపై కన్నేసింది. వాంఖడేలో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లను ఉతికేస్తూ భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సొంతమైదానంలో ఓపెనర్లు రియాన్ రికెల్టన్(57), రోహిత్ శర్మ(12)లు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.
Innings Break!
A power-packed batting effort from @mipaltan 👊
Will it be enough or will it go #LSG‘s way? 🤔
Scorecard ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG pic.twitter.com/GUntWz1Ras
— IndianPremierLeague (@IPL) April 27, 2025
ప్రిన్స్ యాదవ్ వేసిన 2వ ఓవర్లో రెచ్చిపోయిన రికెల్టన్ 6, 4, 4 బాది తన ఉద్దేశాన్ని చాటాడు. ఆ తర్వాతి ఓవర్లో రోహిత్ సైతం మయాంక్ యాదవ్‌కు చుక్కలు చూపిస్తూ రెండు సిక్సర్లు కొట్టాడు. అయితే.. పెద్ద షాట్ ఆడబోయి ఆఖరి బంతికి ప్రిన్స్ చేతికి చిక్కాడు. దాంతో, 33 వద్ద ముంబై తొలి వికెట్ పడింది. అయినా సరే రికెల్టన్ జోరు తగ్గించలేదు. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడి అర్ధ శతకం సాధించాడు. విల్ జాక్స్(29) సైతం రెచ్చిపోవడంతో ముంబై స్కోర్ 10 ఓవర్లకే స్కోర్ 105కు చేరింది.
ప్రమాదకరంగా మారిన రికెల్టన్, జాక్స్ జోడిని దిగ్వేశ్ రథీ విడదీసి లక్నోకు బ్రేక్ ఇచ్చాడు. ఆ కాసేపటికే జాక్స్‌ను ప్రిన్స్ యాదవ్ బౌల్డ్ చేశాడు. వరుసగా రెండు వికెట్లు పడినా సూర్యకుమార్ యాదవ్(54) రాకతో మళ్లీ ముంబై స్కోర్‌బోర్డుకు రెక్కలొచ్చాయి. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(5)తో కలసిఇ ధాటిగా ఆడాడు. కానీ, పాండ్యాను బౌల్డ్ చేసిన మయాంక్ ముంబైని దెబ్బకొట్టాడు. ఆ తర్వాత ప్రిన్స్ వేసిన 16వ ఓవర్లో నమన్ ధిర్(25 నాటౌట్) వరుసగా రెండు ఫోర్లు బాదాడు.
Lights, camera, SIXES! 💪
Surya Kumar Yadav is lighting up Wankhede in his own classical way 💙
Updates ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG | @surya_14kumar pic.twitter.com/F4uLUCgfIV
— IndianPremierLeague (@IPL) April 27, 2025
అవేశ్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో సిక్సర్‌తో సూర్య హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ, ఆ తర్వాత బంతికే కవర్స్‌లో మార్ష్ చేతికి చిక్కాడు. దిగ్వేశ్ బౌలింగ్‌లో కార్బిన్ బాస్చ్(20) 6, 4 కొట్టగా.. నమన్ సిక్సర్ బాది ముంబై స్కోర్ 200 దాటించాడు. అవేశ్ వేసిన 20వ ఓవర్లో 13 రన్స్ రావడంతో ముంబై ప్రత్యర్థికి 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.