MLA Malla Reddy | బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు ధూంధాంగా కొనసాగుతున్నాయి. ఎల్కతుర్తి సభా ప్రాంగణం తెలంగాణ పాటలతో మార్మోగిపోతోంది. కళాకారుల ఆటపాటలకు సభా ప్రాంగణం దద్దరిల్లిపోతోంది. గాయకుల పాటలకు మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాస్ స్టెప్పులతో దుమ్మురేపారు. సభా వేదికపై ఉన్న నేతలంతా కూడా మల్లారెడ్డితో కలిసి స్టెప్పులేశారు. దీంతో జై మల్లన్న, జై తెలంగాణ అనే నినాదాలతో మార్మోగిపోయింది. సభా ప్రాంగణంలో ఉన్న గులాబీ సైనికులు కూడా మల్లారెడ్డి స్టెప్పులతో ఊగిపోయారు. కార్యకర్తలు సైతం డ్యాన్స్ చేసి గులాబీ పార్టీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.
సమ్మక్క సారక్క జాతరోలె..
గులాబీ జాతరకు పోటెత్తిన తెలంగాణ 🔥పులకరించిపోతున్న పోరాటాల పురిటి గడ్డ ఓరుగల్లు 💥#25YearsOfBRS #BRSat25 pic.twitter.com/Y1rLnen0Wz
— BRS Party (@BRSparty) April 27, 2025