Challur High School | వీణవంక, ఏప్రిల్ 27 : చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో చదువుకున్న విద్యార్థులు పాతికేళ్ల జ్ఞాపకాలతో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. మండలంలోని చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు 25 ఏళ్ల తరువాత ఒక్క చోట చేరి ఆడి, పాడి సందడి చేశారు. సభా ముఖంగా కష్ట సుఖాలను పంచుకున్నారు.
చదువు చెప్పిన గురువులకు పూల మాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గురువులు మధు మోహనరావు, రాముకుమార్, సుధాకర్, వెంకటేశ్వర్లు, సుదర్శన్, శ్రీధర్, శాంతి కుమార్, సురేందర్, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.