BRS Rajatotsava Sabha | బచ్చన్నపేట, ఏప్రిల్ 27 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బచ్చన్నపేట మండలం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. నాయకులు కార్యకర్తలు తమ నేత ప్రసంగం వినేందుకు సభ తిలకించేందుకు ఉద్యమ స్ఫూర్తితో బస్సుల్లో, ప్రైవేట్ వాహనాల్లో, కార్లలో సభా స్థలికి కదిలారు. బచ్చన్నపేట ప్రధాన చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద కాళోజీ నారాయణరావు, జయశంకర్ సార్ల విగ్రహాలకు, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. బీఆర్ఎస్ నేతలు అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్పు అనే మాటకు మోసపోయిన తెలంగాణ ప్రజల్లో ఏడాదిన్నర కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకత ఏర్పడిందన్నారు. తమ నేతను కాదనుకొని కాంగ్రెస్కు అధికారమిచ్చి చాలా తప్పు చేశామని రైతులు, ప్రజలు, మహిళలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని.. అందుకే సభకు ప్రతీ పల్లె నుంచి వేలాదిగా కార్యకర్తలు, నాయకులు వచ్చారని ఆయన వెల్లడించారు.
ఎవరిని పలకరించినా కేసీఆర్ మాటే..
తెలంగాణకు శ్రీరామరక్ష కేవలం గులాబీ పార్టీతోనే సాధ్యమని ఆయన అభివర్ణించారు. ఎవరిని పలకరించినా కేసీఆర్ మాటే చెప్తున్నారని అన్నారు. ముఖ్యంగా జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృతంలో నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఆయన చేస్తున్న సేవలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నానని చెప్పారు. అందుకే ఆయన మాటే వేదంగా నాయకులు సమన్వయంతో ముందు సాగుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, వాయిస్ చైర్ పర్సన్ మద్దికుంట రాదా, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరమ్ మాజీ మండల అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి, దూడల కనకయ్య, మండల నాయకులు వడ్డేపల్లి మల్లారెడ్డి, నరెడ్ల బాల్రెడ్డి, జితేందర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, చల్లా శ్రీనివాసరెడ్డి, కొండి వెంకటరెడ్డి ,శ్రీనివాస్, కరుణాకర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, నరేందర్, షబ్బీర్, జావిద్, సిద్దిరాం రెడ్డి, నరసింహులు, భాస్కర్, శ్రీనివాస్ గౌడ్, కోనేటి స్వామి, ముసిని రాజు గౌడ్, సిద్ధారెడ్డి, ఫిరోజ్, వంగాల, శ్రీకాంత్ రెడ్డి, దస్తగిరి, కైసర్, బిక్షపతి, ప్రకాష్, శ్రీధర్, మల్లేష్, హరి ప్రసాద్, కరుణాకర్, గర్నేపల్లి కరుణాకర్, అజీమ్, ఆజాం, రాజనర్సు, అనిల్ రెడ్డి, నర్సిరెడ్డి, శివకుమార్ గౌడ్, రామాంజనేయులు, సిద్ధారెడ్డి, జనార్ధన్, సందీప్ గౌడ్, రాజు గౌడ్, నాగరాజు, స్వామి, ఇంద్రారెడ్డి, బాలచందర్, కనకయ్య, తిరుమల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Giloy | సర్వ రోగ నివారిణి.. తిప్పతీగ.. మన చుట్టూ పరిసరాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది..!
Putta Madhukar | మంత్రి పదవి మంథనికి పైస మందం కూడా పనికొస్తలేదు : పుట్ట మధుకర్
BRS | బీఆర్ఎస్ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారు : దాసరి మనోహర్ రెడ్డి