Volodymyr Zelensky | క్రిమియాను రష్యాలో భాగంగా గుర్తించం.. అమెరికా ప్రతిపాదనను అంగీకరించబోం..!
Volodymyr Zelensky | క్రిమిమా (Crimea) ను ఎప్పటికీ రష్యా (Russia) లో భాగంగా గుర్తించబోమని, ఈ విషయంలో అమెరికా (USA) ప్రతిపాదనను తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని ఉక్రెయిన్ (Ukraine) స్పష్టం చేసింది.
Volodymyr Zelensky : క్రిమిమా (Crimea) ను ఎప్పటికీ రష్యా (Russia) లో భాగంగా గుర్తించబోమని, ఈ విషయంలో అమెరికా (USA) ప్రతిపాదనను తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని ఉక్రెయిన్ (Ukraine) స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) దేశాల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాపై రష్యా నియంత్రణను అమెరికా గుర్తించిందని. ఇకపై క్రిమియా రష్యాతోనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ తిరస్కరించింది.
అమెరికా చేసిన శాంతి ప్రతిపాదనలో క్రిమియాపై రష్యా అధికారం ఉంటుందని పేర్కొనడం తమను షాక్‌కు గురిచేసిందని ఉక్రెయిన్ పేర్కొంది. క్రిమియాను తాము ఎన్నటికీ రష్యాలో భాగంగా గుర్తించబోమని, అమెరికా ప్రతిపాదనను అంగీకరించబోమని తేల్చిచెప్పింది. అమెరికా ప్రతిపాదనకు అసలు అర్థమేలేదని జెలెన్స్కీ పార్టీ ఎమ్మెల్యే ఒలెక్సాండర్ మెరెజ్ఖో అన్నారు. క్రిమియాను రష్యా చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని, దానిని ఆ దేశానికి పూర్తిగా ఇచ్చేయడం అసాధ్యమని పేర్కొన్నారు.
అందుకోసం దేశ రాజ్యాంగంలో మార్పులు చేయాల్సి ఉంటుందని, దేశవ్యాప్తంగా ప్రజల అంగీకారం తీసుకోవాల్సి ఉంటుందని ఒలెక్సాండర్ అన్నారు. క్రిమియాను వదులుకోవడం అంటే తమ అధ్యక్షుడు జెలెన్స్కీకి రాజకీయ ఆత్మహత్యతో సమానమని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఆయన భవిష్యత్తులో ఎన్నో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అంతేకాకుండా దీన్ని తమ దేశంలో రాజద్రోహంగా పరిగణిస్తారని, ఉక్రెయిన్ ప్రభుత్వం ఎప్పటికీ అలాంటి చర్యలు తీసుకోదని చెప్పారు.
మరోవైపు.. ఉక్రెయిన్ ప్రభుత్వం రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ తాము ఈ పోరాటాన్ని ఎన్నటికీ ఆపబోమని ఉక్రెయిన్ సైనిక అధికారులు పేర్కొన్నారు. ఈ యుద్ధంవల్ల ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాలకు ఫలితం కచ్చితంగా తమ దేశ ప్రజలకు దక్కాలని అన్నారు. దక్షిణ ఉక్రెయిన్‌లో నల్ల సముద్రం వెంట ఉన్న క్రిమియా వ్యూహాత్మక ప్రాంతం. 2014లో రష్యా దాన్ని స్వాధీనం చేసుకుంది.
తాజాగా ఇదే అంశంపై మాట్లాడిన ట్రంప్.. క్రిమియా రష్యాతోనే ఉంటుందన్నారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఇది సరైన సమయం కాదన్నారు. వారానికి ఐదు వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇప్పటికైనా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని పుతిన్‌కు సూచించారు. వాటికన్లో ఉక్రెయిన్ అధ్యక్షుడితో సమావేశం అనంతరం పుతిన్‌పై ట్రంప్ విమర్శలు చేశారు. పుతిన్‌కు యుద్ధాన్ని ఆపాలనే ఉద్దేశం లేదనే విషయం తనకు అర్థమవుతోందని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

