IND vs BAN 2nd Test : డ్రా ఖాయం అనుకున్న కాన్పూర్ టెస్టు అనూహ్యంగా భారత్ వైపు తిరుగుతోంది. రెండు రోజులు ఆట సాగకపోవడంతో ఫలితం కోసం టీమిండియా గట్టిగా ప్రయత్నిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 233 పరుగులకే ఆటౌట్ చేసిన రోహిత్ సేన ఆ తర్వాత సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(72), కేఎల్ రాహుల్(68)లు విధ్వంసక హాఫ్ సెంచరీలో పర్యాటక బౌలర్లను హడలెత్తించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్(2/14) ధాటికి బంగ్లా రెండు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఐదో రోజు తొలి సెషన్లో భారత పేసర్లు చెలరేగితే విజయం ఎవరిదో తెలిపోవడం ఖాయం అనిపిస్తోంది.
చెపాక్‌లో బంగ్లాదేశ్‌ను భారీ తేడాతో ఓడించిన భారత జట్టుపై కాన్పూర్‌లో వరుణుడు నీళ్లు చల్లాడు. మూడు రోజుల విరామం తర్వాత ఆట మొదలైంది. అయినా సరే గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన దూకుడు చూపించింది. తొలి ఇన్నింగ్స్‌ను యశస్వీ(72), రాహుల్(56) మెరుపులతో 285-9 వద్ద డిక్లేర్ చేసిన భారత్.. వికెట్ల వేటను మొదలెట్టేసింది.
That’s Stumps on Day 4 in Kanpur!
Stage set for an action-packed final day of Test cricket ⏳
Bangladesh 26/2 in the 2nd innings, trail by 26 runs.
Scorecard – https://t.co/JBVX2gz6EN#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/bbpsdI2jaJ
— BCCI (@BCCI) September 30, 2024
చెపాక్ హీరో అశ్విన్ ఓపెనర్ జకీర్ అలీ హసన్(10)ను ఎల్బీగా వెనక్కి పంపి తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత నైట్ వాష్మన్ హసన్ మహమూద్(4)ను సైతం బౌల్డ్ చేసి బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే.. మరో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం(7 నాటౌట్), మొమినుల్ హక్(0 నాటౌట్)లు ఆచితూచి ఆడి మరో వికెట్ పడనీయలేదు. దాంతో, నాలుగో రోజు ఆటముగిసే సరికి బంగ్లా 26 రన్స్ చేసింది.
Innings Break!#TeamIndia have declared after scoring 285/9 in just 34.4 overs and have a lead of 52 runs 👏👏
Bangladesh 2nd innings coming up.
Scorecard – https://t.co/JBVX2gz6EN#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/8tbuFb6GiT
— BCCI (@BCCI) September 30, 2024
ఐదో రోజు బంగ్లాను త్వరగా ఆలౌట్ చేయడంపైనే రోహిత్ సేన విజయావకాశాలు అధారపడి ఉన్నాయి. ప్రస్తుతానికి 26 పరుగులు వెనకబడి ఉన్న బంగ్లాదేశ్ ఆఖరి రోజు ఏ మేరకు పోరాడుతుంందో చూడాలి. ఐదో రోజు అశ్విన్, జడేజాల జోడీ తిప్పేస్తే బంగ్లాకు కష్టకాలమే. బలమైన పేస్, స్పిన్ లైనప్ ఎంత త్వరగా బంగ్లాను చుట్టేస్తే.. ఆపై బ్యాటర్లు లాంఛనం పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. యశస్వీ జైస్వాల్(72) తన తరహాలో విజృంభించి బంగ్లా బౌలర్లను వణకించాడు. అతడికి తోడుగా శుభ్‌మన్ గిల్(39) కూడా బౌండరీలతో చెలరేగాడు. దాంతో.. 10.1 ఓవర్లకే భారత్ 100 పరుగులతో రికార్డు నెలకొల్పింది.
Fastest Team 50, followed by the fastest Team 100 in Test cricket.#TeamIndia on a rampage here in Kanpur 👏👏#INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/89z8qs1VI1
— BCCI (@BCCI) September 30, 2024
ఈ ఇద్దరూ ఔటయ్యాక కేఎల్ రాహుల్(68), విరాట్ కోహ్లీ(57)లు బ్యాట్ ఝులిపించారు. దాంతో, టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే.. దూకుడుగా ఆడే క్రమంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. పేసర్ ఆకాశ్ దీప్(12) వికెట్ పడగానే కెప్టెన్ రోహిత్ శర్మ 285-9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.