Akash Deep : అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా విజయాల్లో ఒకప్పుడు బ్యాటర్ల వాటానే సింహభాగం ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బౌలర్లు సైతం మేము కూడా జట్టును గెలిపించగలం అని చాటుతున్నారు. అందుకు..పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)నే పెద్ద ఉదాహరణ. గత కొంతకాలంగా అతడు భారత జట్టుకు కొండంత భరోసా ఇస్తున్నాడు. మొన్న టీ20 వరల్డ్ కప్‌లో సంచనల ప్రదర్శనతో జట్టును విజేతగా నిలిపిన యార్కర్ కింగ్.. తాజాగా చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్ నడ్డి విరిచాడు.
మ్యాచ్ విన్నర్‌గా పేరొందిన బుమ్రా ఈతరంలో తనకు సాటి ఇంకొకరు లేరని చాటాడు. తొలి టెస్టులో అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టిన బుమ్రాపై యువపేసర్ ఆకాశ్ దీప్(Akash Deep) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘దేవుడు బుమ్రాను ప్రత్యేకంగా తయారు చేశాడ’ని ఆకాశ్ అన్నాడు.
Morne Morkel praises the hard work of Akash Deep 👏 A true example of perseverance and dedication on the field.🫡 pic.twitter.com/rbQhleLJEW
— Nirupama Shukla (@__Nirupama) September 20, 2024
‘నేను తరచుగా బుమ్రాతో మాట్లాడుతా. అతడి బౌలింగ్‌ను గమనిస్తుంటా. అతడు చాలా ప్రత్యేకం. అతడిని దేవుడు విభిన్నంగా తయారుచేశాడు. అతడి నుంచి నేను చాలా సలహాలు తీసుకుంటా. ఓ బౌలర్‌గా అతడిని చూసి చాలా నేర్చుకున్నా కూడా. అంతేకాదు ఓసారి బుమ్రాతో ఫలానా బ్యాటర్‌కు బౌలింగ్ చేసేటప్పుడు మైండ్‌సెట్ ఎలా ఉండాలి? అని అడిగాను . అందుకు బుమ్రా విలువైన సలహాతో నా సందేహాన్ని తీర్చాడు’ అని ఆకాశ్ దీప్ వెల్లడించాడు. అంతేకాదు బుమ్రా ఓ గిఫ్టెడ్ బౌలర్. అతడి అడుగుజాడల్లో నడవడం కూడా పెద్ద టాస్క్ అని ఈ బెంగాల్ పేసర్ అన్నాడు.
చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో బుమ్రా తన పేస్ పవర్ చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్(113) సూపర్ సెంచరీ అనంతరం ఈ యార్కర్ కింగ్ నిప్పులు చెరిగాడు. బంగ్లా టాపార్డర్‌ను కూల్చి 4 వికెట్లతో పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఆకాశ్ దీప్ కూడా దులీప్ ట్రోఫీ ఫామ్‌ను కొనసాగిస్తూ ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లో ఔరా అనిపించాడు. దాంతో, భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. ఇక శుభ్‌మన్ గిల్(119 నాటౌట్), రిషభ్ పంత్(109)ల శతక గర్జనకు అశ్విన్ (688) మాయాజాలం తోడవ్వడంతో టీమిండియా 280 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.