T20 World Cup 2024 : మహిళల టీ20 వరల్డ్ కప్ తొమ్మిదో ఎడిషన్‌కు ఇంకో పది రోజులే ఉంది. క్రికెట్ అభిమానులతో పాటు అన్ని జట్లు కూడా ఈ మెగా టోర్నీ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ పొట్టి వరల్డ్ కప్ క్రేజ్‌ను మరింత పెంచేందుకు థీమ్ పాటను విడుదల చేసింది. ‘వాటెవర్ ఇట్ టేక్స్'(Whatever It Takes) తెలుగులో ‘ఏదైనా చేసేద్దాం’ అనే టైటిల్‌తో కూడిన ఈ పాట వీడియో వరల్డ్ కప్ ట్రోఫీతో మొదలవుతుంది.
ఒక నిమిషం 40 సెకండ్ల నిడివిగల ఈ వీడియో మహిళల క్రికెట్ కోసం ఎంతో కృషి చేసిన క్రీడాకారిణుల ప్రయాణాన్ని కళ్లకు కట్టింది. అంతేకాదు మెగా టోర్నీలో పాల్గొంటున్న జట్లు, గతంలో ట్రోఫీని ముద్దాడిని జట్ల విజయోత్సవ సంబురాలను అద్భుతంగా ఆవిష్కరించారు. దాంతో, ఈ వీడియో చూసిన అభిమానులు వరల్డ్ కప్ జోష్‌లో మునిగి తేలుతున్నారు.
Ready to shake the ground 💥
Presenting the official ICC Women’s #T20WorldCup 2024 event song ‘Whatever It Takes’ performed by @WiSH_Official__#WhateverItTakes https://t.co/3I3TJmJndo
— ICC (@ICC) September 23, 2024
‘మహిళల టీ20 వరల్డ్ కప్‌ను సాధ్యమైనంత వరకూ గొప్పగా నిర్వహించేందుకు ఐసీసీ కట్టుబడి ఉంది అని ఐసీసీ జనరల్ మేనేజర్ క్లేర్ ఫర్లాంగ్ తెలిపాడు. ప్రపంచ వేదికపై మహిళల క్రికెట్ తగినంత పేరు సంపాదించింది. అఫీషియల్ సాంగ్ ద్వారా మహిళల క్రికెట్‌కు మరింత పేరు, ప్రఖ్యాతలు తేవాలనేది మా ఉద్దేశం. మైదానంలో క్రికెటర్లు కనబరిచే ప్రతిభకు నిదర్శనం మాత్రమే కాదు కొత్త తరాలో స్ఫూర్తి నింపడం, మహిళల క్రికెట్ అభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించేందుకు ఈ సౌండ్‌ట్రాక్ కొలమానం’ అని ఆయన చెప్పాడు.
టీ20 వరల్డ్ కప్ కోసం వాటెవర్ ఇట్ టేక్స్ అనే అధికారిక పాటను బే మ్యూజిక్ సంస్థ రూపొందించింది. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు మికే మెక్‌క్లియరీ, కంపోజర్ పార్థ్ పరేఖ్లు పనిచేశారు. వరల్డ్ కప్ థీమ్ సాంగ్‌ను అన్ని రకాల స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి యూఏఈ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ మొదలవ్వనుంది. 17 రోజుల పాటు అభిమానులను అలరించనున్న ఈ టోర్నీలో కొత్త విజేతను చూస్తామా? అని యావత్ క్రీడాలోకం ఆసక్తిగా ఉంది.