AlluArjun’s involvement in Jani Master issue | లేడి కొరియెగ్రాఫర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ప్రముఖ కొరియెగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో జానీపై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తోపాటు పోక్సో కేసులు నమోదు కాగా.. దీనిపై విచారణ జరిపిన ఉప్పరపల్లి కోర్టు (Upparpally court) 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 3 వరకు రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించింది. అయితే ఈ విషయంలో ఆ అమ్మాయికి అండగా అల్లు అర్జున్ ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ క్లారిటీ ఇచ్చాడు.
మైత్రీ మూవీ మేకర్స్ అధినేత.. ‘మత్తు వదలరా 2’ నిర్మాత అయిన రవిశంకర్ తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్లో పాల్గోన్నాడు. అయితే ఒక రిపోర్టర్ అడుగుతూ.. జానీమాస్టర్ వివాదంలో ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నట్లు అల్లు అర్జున్, సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై మీరు ఏం అంటారు అనగా.. రవిశంకర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు చూస్తే.. లైంగిక వేధింపులకు గురైనా అమ్మాయి, జానీ మాస్టర్లది వ్యక్తిగతమైన విషయమని అర్థమవుతోంది. ‘పుష్ప 2’ మొదలైనప్పుడే ఆ అమ్మాయిని అడిషనల్ కొరియెగ్రాఫర్గా తీసుకున్నాం. గణేష్ ఆచార్య ప్రధాన కొరియెగ్రాఫర్. ఆ అమ్మాయి ఏమైనా కొత్త స్టెప్పులు ఇస్తే గనుకా గణేష్ మాస్టర్ వాటిని మూవీలో తీసుకునేవారు. సినిమాలోని అన్ని పాటలకు ఆమె వర్క్ చేసింది. పుష్ప సినిమాలో ఇంకా రెండు పాటలు మిగిలి ఉన్నాయి. ఆ పాటలకు కూడా ఆమె కొరియెగ్రాఫి చేయనుంది. అక్టోబర్ 15 తర్వాత ఆ పాటల చిత్రీకరణ ఉంటుంది. జానీ మాస్టర్‌తో కూడా ఒక పాట ప్లాన్ చేశాం కానీ ఇంతలోనే ఇది అయ్యింది. షూటింగ్లో విషెస్ చెబితే తప్ప పలకరించడం హీరోకు తెలియదు. ఇలాంటివి ఫేక్ వార్తలు ఇవి నమ్మకండి. సెన్సేషన్ కావడం కోసమే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి వార్తలను ప్రచురిస్తున్నట్లు రవిశంకర్ తెలిపాడు. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా అది వారి వ్యక్తిగతం.. దానిపై మనం కామెంట్ చేయకూడదు అంటూ రవిశంకర్ వెల్లడించాడు.
Clarification on rumours about #AlluArjun’s involvement in Jani Master issue. pic.twitter.com/9ftbFzXrsk
— Aakashavaani (@TheAakashavaani) September 23, 2024
Also Read..