KTR | ఆసుపత్రులను పరిశీలించేందుకు వెళ్తే అరెస్టులా..? ఎందుకింత భయం నీకు రేవంత్..? నిలదీసిన కేటీఆర్
KTR | గాంధీ దవాఖానలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రులను పరిశీలించేందుకు వెళ్తే అరెస్టులా..? ఎందుకింత భయం నీకు రేవంత్..? అని కేటీఆర్ నిలదీశారు.
KTR | హైదరాబాద్ : గాంధీ దవాఖానలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కమిటీ అధ్యక్షుడు మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య, సభ్యులు మెతుకు ఆనంద్, డాక్టర్ సంజయ్‌తో పాటు హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షులు మాగంటి గోపినాథ్‌ను గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆసుపత్రులను పరిశీలించేందుకు వెళ్తే అరెస్టులా..? ఎందుకింత భయం నీకు రేవంత్..? అని కేటీఆర్ నిలదీశారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో ప్రయత్నం చేసిన పార్టీ ఎమ్మెల్యేలను, సీనియర్ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులలోకి వెళ్లకుండా అడ్డంకులు కల్పించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసమే, స్వయంగా డాక్టర్లు అయిన మా నాయకులు ఆసుపత్రులను పరిశీలిస్తారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడినా, ప్రజారోగ్య వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతామని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఆసుపత్రులను పరిశీలించేందుకు వెళ్తే అరెస్టులా❓
ఎందుకింత భయం నీకు రేవంత్❓రాష్ట్రంలో దిగజారిన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులను పరిశీలించేందుకు భారత రాష్ట్ర సమితి నియమించిన అధ్యయన కమిటీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం డా. తాటికొండ రాజయ్యను, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే… pic.twitter.com/24V96uqRPT
— BRS Party (@BRSparty) September 23, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | అబద్ధం ఆడితే అతికేటట్టు ఉండాలి.. మంత్రి శ్రీధర్ బాబుకు హరీష్ రావు కౌంటర్
Harish Rao | 10 నెలల్లో 2 వేల అత్యాచారాలు.. ఇదీ రేవంత్ రెడ్డి పాలన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్దూరును కరువు మండలంగా ప్రకటించాలి.. మండల సభను బహిష్కరించిన సర్పంచులు
Eetha Trailer | ‘ఛావా’ దర్శకుడి కొత్త సినిమా.. శ్రద్ధా కపూర్ ‘ఈతా’ ట్రైలర్ విడుదల!
‘పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి’
Europe | వాతావరణ మార్పులతోనే యూరప్‌లో ఎండలు.. 50వేల మరణాలకు అవే కారణం..
‘సీతారామ ప్రాజెక్టుతో సింగరేణి మండలానికి ఒరిగిందేమీ లేదు’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

