Harish Rao | హైదరాబాద్ : అబద్ధం ఆడితే అతికేటట్టు ఉండాలి అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. మీటింగ్ అరికెపూడి గాంధీ నియోజకవర్గంలో జరిగిందని ముఖ్యమంత్రిని మర్యాదకపూర్వంగా కలవడానికి వెళ్ళాడంట అని శ్రీధర్ బాబు మాట్లాడడాన్ని హరీశ్‌రావు తప్పుబట్టారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
‘శాసనసభ వ్యవహారాల మంత్రి గారూ.. సీఎల్పీ సమావేశానికి అరికెపూడి గాంధీ వచ్చారు. ఇకనైనా ఫిరాయింపులపై బుకాయింపులు మానండి.. అని నేను ట్వీట్ చేశాను. దాని మీద శ్రీధర్ బాబు తనకున్న చాకచాక్యాన్ని, తెలివితేటలను ఉపయోగించి.. ఏం అంటారంటే.. సీఎల్పీ మీటింగ్ గాంధీ నియోజకవర్గంలో జరిగిందట.. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చాడని శ్రీధర్ బాబు అన్నారు. అధికారిక మీటింగ్‌కు సీఎం వస్తే.. మర్యాదపూర్వకంగా కలిసేందుకు వస్తారు తప్ప.. పార్టీ మీటింగ్‌కు రారు అనే విషయాన్ని శ్రీధర్ బాబు గ్రహించాలి. సరే గాంధీ గారిది అయితే నియోజకవర్గం.. మరి ప్రకాశ్ గౌడ్ ఎందుకు వచ్చారు..? శ్రీహరి ఎందుకు వచ్చారు..? దానికి సమాధానం చెబుతారా..? అబద్దం ఆడితే అతికేటట్టు అయినా ఉండాలా.?? జనం ఛీఛీ అంటున్నరు. మీరు ఎన్ని అబద్దాలు మాట్లాడుతారు.. ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతాడు. మళ్లీ వీరంతా మీటింగ్‌కు పోతారు. ఇది ఇద్దరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొట్లాట అని శ్రీధర్ బాబు అంటడు. ఇవాళ్నేమో కలవడానికి వచ్చిండు అంటడు అదే శ్రీధర్ బాబు. కానీ నగ్నంగా బయటపడింది. ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నగ్నంగా బయటపడింది. ఇంకా దాన్ని బుకాయించే ప్రయత్నం, దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరేం చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని’ హరీశ్‌రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Janhvi Kapoor | తల్లి బాటలో జాన్వీకపూర్.. లంగా ఓణీలో మెరిసిన దేవర బ్యూటీ
Harish Rao | 10 నెలల్లో 2 వేల అత్యాచారాలు.. ఇదీ రేవంత్ రెడ్డి పాలన