జోగులాంబ గద్వాల : కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు(Government schools) సమస్యలకు నిలయంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టించుకో కపోవడం బడుగుల బిడ్డ చదువులకు దూరమవుతున్నారు. విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయులు(Teachers) లేక ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేక విద్యా వ్యవస్థ అస్తవ్యస్థ్యంగా మారింది. తాజాగా జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లా ఆరగిద్ద ప్రాథమిక పాఠశాలలో 306 మంది విద్యార్థులకు గాను ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.
దీంతో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేశారు. దసరా సెలవుల తర్వాత వలంటీర్ల నియమిస్తామని ఎంఈఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిం చారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రైవేట్ పాఠశాలలు హంగులు ఆర్భాటాలతో విద్యార్థులను తమ పాఠశా లల్లో చేర్పించుకునేందుకు పోటీపడుతుంటే ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.