హైదరాబాద్ : కరీంనగర్ ఎల్ఎండీలో(Karimnagar LMD) దూకి వివాహిత సంధ్య ఆత్మహత్యాయత్నానికి (Attempted suicide) పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..టూరిస్ట్ బోటులో టికెట్ కొనుక్కుని బోటు ఎక్కిన సంధ్య అనే మహిళ బోట్ స్పీడ్ పెంచగానే వెనక్కి వెళ్లి నీటిలో దూకేసింది. వెంటనే గమనించిన బోట్ డ్రైవర్, బోటులో ప్రయాణిస్తున్న మరికొందరు వ్యక్తులు మహిళను రక్షించారు. అనంతరం లేక్ పోలీసులకు సమాచారమిచ్చి సదరు మహిళను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ ఎల్ఎండీలో దూకి వివాహిత సంధ్య ఆత్మహత్యాయత్నం
టూరిస్ట్ బోటులో టికెట్ కొనుక్కుని బోటు ఎక్కిన సదరు మహిళ
బోట్ స్పీడ్ పెంచగానే వెనక్కి వెళ్లి నీటిలో దూకేసిన మహిళ
సేఫ్ జాకెట్ విసిరి మహిళను కాపాడిన బోట్ డ్రైవర్, బోటులో ప్రయాణిస్తున్న మరికొందరు వ్యక్తులు
లేక్ పోలీసులకు… pic.twitter.com/3Eaeko9d7S
— Telugu Scribe (@TeluguScribe) September 23, 2024