తిరువనంతపురం: కేరళలోని కాసర్గడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మణికందన్ అనే వ్యక్తి బ్రెయిన్ ఈటింగ్ అమీబా(Brain Eating Amoeba Infection) వ్యాధితో మృతిచెందాడు. కన్నౌరులోని ప్రైవేటు ఆస్పత్రిలో అతను అమీబిక్ మెనింజోఇన్సెఫలైటిస్కు చికిత్స తీసుకున్నాడు. ఆదివారం సాయంత్రం అతను కన్నుమూశాడు. బాధిత వ్యక్తి ముంబైలో పనిచేస్తున్నాడు. జ్వరం రావడంతో అతను ఇంటికి వచ్చాడు. కాసర్గడ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో అతను చికిత్స పొందాడు. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ టెస్టు ఆధారంగా.. అతనికి అమీబిక్ మెనింన్జోసెఫలైటిస్ ఉన్నట్లు గుర్తించారు. అమీబిక్ పీసీఆర్ టెస్టు ఆధారంగా దీనిపై మరోసారి పూర్తి కన్ఫర్మేషన్ ఇవ్వనున్నారు.