Lightning Strike | ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు (Lightning Strike) ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉండటం కలచివేస్తోంది.
రాజ్‌నంద్‌గావ్ (Rajnandgaon) జిల్లాలోని జోరటరాయ్ గ్రామంలో (Joratarai village) సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఎస్పీ మోహిత్ గార్గ్ తెలిపారు. పిడుగుపాటుకు నలుగురు పాఠశాల విద్యార్థులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఒకరికి గాయాలైనట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించామన్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Eight persons, including four children, died due to lightening in Rajnandgaon district of Chhattisgarh: SP Rajnandgaon, Mohit Garg
— ANI (@ANI) September 23, 2024
ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజ్‌నంద్‌గావ్‌లోని జోరటరాయ్ గ్రామంలో పిడుగుపాటుకు నలుగురు పాఠశాల విద్యార్థులు సహా ఎనిమిది మంది మరణించడం చాలా బాధాకరం అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ మేరకు సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని.. సరైన నష్టపరిహారం అందించాలని కోరారు.
राजनांदगांव के ग्राम जोरातराई में आकाशीय बिजली गिरने से 4 स्कूली बच्चों समेत 8 लोगों की मौत की खबर बेहद हृदयविदारक है.
ईश्वर दिवंगतों के परिवारजनों को यह आघात सहने की शक्ति प्रदान करे एवं मृतकों की आत्मा को शांति दे. ओम् शांति:
शासन एवं प्रशासन से अनुरोध है कि इनके परिवारों की…
— Bhupesh Baghel (@bhupeshbaghel) September 23, 2024
Also Read..
Parvati Nair | ఇంటి సహాయకుడిపై దాడి.. ‘ది గోట్’ నటి పార్వతి నాయర్‌పై కేసు నమోదు
Laapataa Ladies | ఆస్కార్‌కు కిరణ్ రావు ‘లాపతా లేడీస్’