Laapataa Ladies | ఆమీర్ ఖాన్ (Aamir Khan) ప్రోడక్షన్లో, ఆయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies) చిత్రం అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా 2025 ఆస్కార్ (Oscars 2025)కు మన దేశం నుంచి ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా వెల్లడించింది.
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) ప్రోడక్షన్లో వచ్చిన చిత్రం ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies). ఆయన మాజీ భార్య కిరణ్ రావ్ (Kiran Rao) ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. జమ్తారా (Jamtara) వెబ్‌సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ (Sparsh Shrivastav) ఈ మూవీలో హీరోగా నటించగా.. భోజ్‌పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో మెరిశాడు. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నది. సుప్రీం కోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అయిన సందర్భంగా.. కోర్టు అడ్మినిస్ట్రేట్ వేడుకల్లోనూ ఈ చిత్రం ప్రదర్శితమైంది.
కాగా, రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో కిరణ్‌రావు మాట్లాడుతూ.. తమ చిత్రం ఆస్కార్ వేదికపై మనదేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది తనతోపాటు చిత్ర బృందం కోరికని వెల్లడించారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా తనవంతు బాధ్యతగా ఆస్కార్‌కు పంపిస్తుందనే నమ్మకం ఉన్నదనీ చెప్పుకొచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన కిరణ్‌రావు.. 2011లో అమీర్‌ఖాన్ హీరోగా ‘ధోభీ ఘాట్’ అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. ఆ తర్వాత ‘లాపతా లేడీస్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే..
2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కొత్తగా పెళ్లి అయిన ఓ జంట పెళ్లి అనంతరం ఇంటికి వస్తుండగా మధ్యలో తన భార్య మిస్ అవుతుంది. అయితే ఈ విషయం తెలియక వరుడు తన భార్య అనుకుని వేరే అతడి భార్యను ఇంటికి తీసుకువస్తాడు. తీరా ఇంటికి వచ్చిన చూసిన అనంతరం తన భార్య కాదని షాక్ అవుతాడు. దీంతో తన భార్య పోయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇస్తాడు. అయితే తన భార్య ఎలా మిస్ అయ్యింది. తన భార్య స్థానంలో వచ్చిన అమ్మాయి ఎవరు. ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఏంటి అనే స్టోరీతో ఈ సినిమా వచ్చింది.
Also Read..
Mahesh Babu | సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు అందజేసిన మహేశ్ బాబు
Pushpa 2 The Rule | అస్సలు తగ్గేదేలే.. ‘పుష్ప ది రూల్’ నుంచి అల్లు అర్జున్ కొత్త పోస్టర్
Mazaka Movie | ధమాకా దర్శకుడితో ‘మజాకా’ అంటూ వస్తున్న సందీప్ కిషన్