Mazaka Movie | టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఈ ఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్‌తో పాటు ఊరుపేరు భైరవకోన, రాయన్ సినిమాలతో హిట్లు అందుకున్న ఈ కుర్ర హీరో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. గతేడాది రవితేజతో ధమాకాతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రినాధరావు నక్కినతో తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు సందీప్ కిషన్. ఈ సినిమాకు మజాకా అంటూ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో సందీప్ కిషన్ పంచె కట్టులో కొత్తగా కనిపిస్తున్నాడు.
కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రీతువర్మ కథానాయికగా నటిస్తుంది. రావు రమేశ్, ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రూ. 23 కోట్లకు అమ్ముడుపోయాయి.
#Mazaka for Sankaranthi 2025 🙏🏽
2025 Marks my 15th year as an Actor,My 30th Film & my 1st ever Festival/Holiday Release
Thank you @TrinadharaoNak1 garu @AnilSunkara1 garu , @RajeshDanda_ @lemonsprasad garu @KumarBezwada & my Fans for this & for
‘People’s Star’ ♥️@ZeeStudios_ pic.twitter.com/9uEcdvUze6— Sundeep Kishan (@sundeepkishan) September 23, 2024
Also Read..