Ram Charan 16 | ఆర్ఆర్ఆర్ విజయంతో ఫామ్‌లో ఉన్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రానుండగా.. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనతో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
ఆర్సీ16 వర్కిల్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ బరువు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ 100 కేజీలకు పైగా బరువు పెరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది. ఉత్తరాంధ్రా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఆస్కార్-విజేత A.R. రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.
ALso Read..