Snake | రన్నింగ్ ట్రైన్లో పాము ప్రత్యక్షం.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వైరల్ వీడియో
Snake | జబల్పూర్ - ముంబై (Jabalpur-Mumbai) గరీభ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు (Garib Rath Express) లో పాము (Snake) ప్రత్యక్షమైంది.
Snake | జబల్పూర్ – ముంబై (Jabalpur-Mumbai) గరీభ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు (Garib Rath Express) లో పాము (Snake) ప్రత్యక్షమైంది. బుసలు కొడుతూ ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి గరీభ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ముంబైకి బయల్దేరింది. మార్గం మధ్యలో కాసర రైల్వే స్టేషన్ సమీపిస్తున్న తరుణంలో ఏసీ కోచ్ జీ3లో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమైంది. అప్పర్ బెర్త్ (23) పైన ఐరన్ రాడ్‌ను చుట్టేసుకుని బుసలు కొడుతూ కనిపించింది. పామును చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. గట్టిగా కేకలు వేస్తూ వేరే కోచ్‌లోకి పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని పామును పట్టుకొని బయటకు వదిలేశారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు ప్రయాణికులు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Snake On A Train! “Gareeb rath mein ameer kahan se aa gaya ye?” (How has this rich one come to Gareeb Rath (name of train). The sense of humour of Indians is legendary🤣. Jokes apart, a snake found in Jabalpur-Mumbai Garib Rath Express. #snake #snakeVideo pic.twitter.com/xLP9T2A3cD
— Abhishek Yadav (@geopolimics) September 22, 2024
Also Read..
Donald Trump | ఈ ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయను.. ట్రంప్ కీలక ప్రకటన
PM Modi | గూగుల్ టు ఎన్విడియా.. 15 టాప్ టెక్ సీఈవోలతో ప్రధాని మోదీ రౌండ్ టేబుల్ సమావేశం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

