Nitin Gadkari | తోటి కేబినెట్ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) (RPI) చీఫ్ రామ్‌దాస్ అథవాలే (Ramdas Athawale)ని ఉద్దేశించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari ) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం (ఎన్డీయే) నాలుగోసారి అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు కానీ.. ఆయన మాత్రం మరోసారి మంత్రి అవుతారంటూ వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర నాగ్‌పూర్ (Nagpur)లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో స్టేజ్‌పై అథవాలే కూడా ఉండటం గమనార్హం. ‘మా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందని హామీ ఇవ్వలేను.. కానీ రాందాస్ అథవాలే మాత్రం మంత్రి అవుతారని ఖచ్చితంగా హామీ ఇవ్వగలను’ అంటూ చమత్కరించారు. ఇది జోక్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో స్టేజ్‌పై ఉన్న అథవాలే సరదాగా నవ్వులు చిందించారు. ప్రస్తుతం గడ్కరీ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాగా, రామ్‌దాస్ అథవాలే వరుసగా మూడుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే తన పరంపరను కొనసాగిస్తానని ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read..
PM Modi | గూగుల్ టు ఎన్విడియా.. 15 టాప్ టెక్ సీఈవోలతో ప్రధాని మోదీ రౌండ్ టేబుల్ సమావేశం
Anura Kumar Dissanayake | శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిసనాయకే ప్రమాణస్వీకారం
Donald Trump | ఈ ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయను.. ట్రంప్ కీలక ప్రకటన