PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అమెరికా పర్యటన కొనసాగుతోంది. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ప్రధాని.. క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొన్నారు. ఆ తర్వాత న్యూయార్క్‌లో జరిగిన ప్రవాస భారతీయులతో ప్రత్యేక కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తాజాగా టెక్ కంపెనీల సీఈవోలతో ప్రధాని రౌండ్ టేబుల్ సమావేశంలో (Roundtable Meet) పాల్గొన్నారు.
మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్.. న్యూయార్క్‌లోని ఓ హోటల్లో ఈ సమావేశాన్ని నిర్వహించింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఎన్విడియా సీఈవో జెన్సెన్ హాంగ్ సహా 15 టాప్ టెక్ సీఈవోలు (15 Tech CEOs) ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోను మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. సీఈవోలతో ఫలప్రదమైన చర్చలు జరిగాయని, టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. సాంకేతికత, ఆవిష్కరణలు సహా పలు అంశాలపై చర్చలు జరిపామన్నారు. ఆయా రంగాల్లో భారత్ సాధించిన ప్రగతి గురించి మాట్లాడినట్లు చెప్పారు. మేడ్ బై ఇండియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు వెల్లడించారు.
Had a fruitful roundtable with tech CEOs in New York, discussing aspects relating to technology, innovation and more. Also highlighted the strides made by India in this field. I am glad to see immense optimism towards India. pic.twitter.com/qW3sZ4fv3t
— Narendra Modi (@narendramodi) September 23, 2024
Also Read..
Anura Kumar Dissanayake | శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిసనాయకే ప్రమాణస్వీకారం
Donald Trump | ఈ ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయను.. ట్రంప్ కీలక ప్రకటన
MLA Sunitha Lakshma Reddy | ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంపై కాంగ్రెస్ మూకల దాడి