MLA Sunitha Lakshma Reddy | ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంపై కాంగ్రెస్ మూకల దాడి
నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి (MLA Sunitha Lakshma Reddy) నివాసంపై కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఇటుకలు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఆదివారం అర్ధరాత్రి హంగామా చేశారు.
మెదక్: నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి (MLA Sunitha Lakshma Reddy) నివాసంపై కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఇటుకలు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఆదివారం అర్ధరాత్రి హంగామా చేశారు. వినాయక నిమజ్జనం అడ్డుపెట్టుకుని గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి గేటు ముందు పటాకులు కాల్చారు. అయితే ఆ ఇంట్లో ఉంటున్న మనిదీప్ గౌడ్ అనే యువకుడు ఇదేంటని అడిగితే.. అతనిపై దాడిచేశారు. అంతటితో ఆగకుండా ఇంటిపైకి ఇటుకలు విసిరారు.

దీంతో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకొని కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. రాత్రిపూట దాడులు చేయడం కాంగ్రెస్ నాయకుల పిరికిపంద చర్య బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దాడికి నిరసనగా ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
BRS ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం
వినాయక నిమజ్జనం చేస్తూ ఎమ్మెల్యే ఇంటి ముందు పటాకులు కాల్చిన కాంగ్రెస్ కార్యకర్తలు
అడ్డుకుని వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే అనుచరులు, BRS కార్యకర్తలు pic.twitter.com/XkUjp1LbqT
— Telugu Scribe (@TeluguScribe) September 23, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Attack
- BRS
- Congress
- Ganesh Nimajjan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

