Bigg Boss Telugu 8 | బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో వారంలో తెలంగాణ పోరడు అభయ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తొలి రెండు వారాలు హౌస్‌లో మంచి పోటీ ఇచ్చేలా కనిపించిన ఇతడు బిగ్‌బాస్‌ను తిట్టడంతో నాగార్జున రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపించేశాడు. అయితే తాను బయటకు వచ్చిన అనంతరం అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశాడు.
నా అభిమానులందరికి ముందుకు క్షమాపణలు చెబుతున్నా. నేను బయటకు వచ్చాక తెలిసింది. బిగ్‌బాస్ హౌస్‌లో నేను ఇంకా ఎక్కువ రోజులు ఉంటానని మీరు అనుకున్నారని. మిమ్మల్ని నిరాశపరచినందుకు క్షమించండి. కానీ వెళ్లే ముందు నేను హౌస్ నుంచి బయటకు వెళ్లిన కూడా దిల్ దార్ ఉంటా. అది నచ్చితే లోపల ఉంటా లేదంటే ఉండనని. దురదృష్టవశాత్తూ బయటకొచ్చేశా. నాకు ఓట్లు వేసి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ మరోసారి థ్యాంక్స్. ఈ హౌస్ నుంచి మీకు దగ్గరయ్యా.. నా సినిమాలతో మరింత దగ్గరవుతా. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా నా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మిమ్మల్ని పలకరిస్తుంటా అంటూ అభయ్ చెప్పుకోచ్చాడు.