High Court | క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలు మూడు వారాల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు
మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలు మూడు వారాల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మంచిర్యాల : జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలు ( Kyatanapalli municipal elections ) మూడు వారాల్లో నిర్వహించాలని హైకోర్టు ( High Court ) ఆదేశాలు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం తరహాలోనే క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికలు జరిగి నెలరోజులు కావస్తున్నా క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికకు కాంగ్రెస్ అడ్డం పడుతుంది.
మెజారిటీ లేకున్నా బలప్రయోగం, బెదిరింపులతో హస్తగతం చేసుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ , సీపీఐ అభ్యర్థులు 14 మంది గెలుపొందారు. ఇక సమావేశంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనమే అన్న తరుణంలో కాంగ్రెస్‌కు చెందిన నాయకులు, మంత్రి వివేక్ ,ఎంపీ పోలీసుల సహకారంతో అడ్డుపడుతూ వచ్చారు.
చివరకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలులు పెట్టారు. అయితే ఇప్పటి వరకు పాలక వర్గం ఎన్నిక నిర్వహించకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు కోర్టుకు వెళ్లగా హైకోర్టు శుక్రవారం ఎన్నికల నిర్వహణకు తగు ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

