అటు గోపాలమిత్రగా.. ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. యథేచ్ఛగా రెండింటినీ అనుభవిస్తున్న హస్తం నేత
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. హస్తం సర్కారు పాలనలో నిబంధనలు, నియమాలు ఏమీ పాటించడం లేదు. కాంగ్రెస్ భువనగిరి మండల అధ్యక్షుడిగా కొనసాగుతూనే.. మరోవైపు గోపాలమిత్రగా గౌర వం వేతనం పొందుతున్నారు.
- ఆయన భార్య ఖాతాలోకి జీపీ డబ్బుల మళ్లింపు
- కాలువను చెడగొట్టి సొంతింటి నిర్మాణం
- చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు
యాదాద్రి భువనగిరి, జూలై 27(నమస్తే తెలంగాణ) : రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. హస్తం సర్కారు పాలనలో నిబంధనలు, నియమాలు ఏమీ పాటించడం లేదు. కాంగ్రెస్ భువనగిరి మండల అధ్యక్షుడిగా కొనసాగుతూనే.. మరోవైపు గోపాలమిత్రగా గౌర వం వేతనం పొందుతున్నారు. అంతే కాకుండా అద్దెల ద్వారా పంచాయతీకి రావాల్సిన డబ్బులను ఆయన భార్య, మాజీ సర్పంచ్ బ్యాంకు ఖాతాలో జమ చేసుకుంటున్నారు. ఆయా అంశాలపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నేత అతికం లక్ష్మీనారాయణ గౌడ్ సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అనురాగ్ జయంతికి ఫిర్యాదు చేశారు.
గోపాలమిత్రగా గౌరవ వేతం పొందుతూనే..
గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతుల ఇంటి ముంగిట పశువులకు అత్యవసర వైద్య సేవలు, కృత్రిమ గర్భధారణ అందించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ గోపాలమిత్ర. పశుసంవర్ధక శాఖ కింద నడుస్తుంది. పశువులకు టీకాలు వేయడం, నట్టల నివారణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ప్రభుత్వం నుంచి నెలకు రూ.10,050 గౌరవ వేతనం అందుతుంది. గోపాలమిత్రగా పనిచేస్తున్న వ్యక్తి పార్టీ పదవులు చేపట్టడానికి వీలుండదు. అయితే భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి, నమాత్ పల్లి, నందనం గ్రామాలకు గోపాలమిత్రగా ఎల్లంల జంగయ్య పనిచేస్తున్నారు. నెలనెలా గౌరవం వేతనం కూడా పొందుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అయనే ఇప్పుడు కాంగ్రెస్ భువనగిరి మండల అధ్యక్షుడిగా కొనసాగుతుండ టం విశేషం. అంతే కాకుండా ఇందిరమ్మ ఇండ్ల కమిటీలోనూ సభ్యుడిగా ఉన్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి గౌరవ వేతన పొందుతూనే.. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
జీపీ డబ్బులు బ్యాంకు ఖాతాలోకి..
మండలంలోని నమాత్పల్లిలో పంచాయతీ భవనంలో అంగన్వాడీ కేంద్రం నడుస్తున్నది. దీనికి నెలనెలా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఆ రెంట్‌ను పంచాయతీ బ్యాంకు ఖాతాలో జమ చేయా లి. కానీ జంగయ్య భార్య, శాలిని తన ఖాతాలో జమ చేయించుకుంటున్నా రు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు సుమారు ఏడేండ్ల కిరాయి వేసుకొని సొంతానికి వాడుకున్నారు. సర్పంచ్ పదవి కాలం ఐదేండ్లతోపాటు, మా జీ సర్పంచ్‌గా కూడా రెండేండ్లుగా డబ్బు లు ఉపయోగించుకున్నారు. ఇది ప్రభు త్వ సొమ్మును దుర్వినియోగం చేయడమేనని, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిం చిన మాజీ సర్పంచ్‌పై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టాలని లక్ష్మీనారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా సాగునీరు పోయే మర్రిచెరువు తూము కాలువను చెడగొట్టి ఇంటి నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులో కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

