Indian Hockey : భారత హాకీ జట్టు జెర్సీ రంగు మార్పుపై దుమారం రేపిన విషయం తెలిసిందే. ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్‌కప్(FIH Hockey World Cup) ముందు నీలం రంగు స్థానంలో కాషాయంను ప్రవేశపెట్టడంపై విమర్శలు రాగా.. ఆ టోర్నీలో అదే జెర్సీతో ఆడిన టీమిండియా నిరాశపరిచింది. దాంతో.. రాబోయే టోర్నమెంట్లలో మునపటి బ్లూ కలర్‌నే కొనసాగించాలని భారత జట్టు నిర్ణయించుకుందని సమాచారం. త్వరలో జరుగనున్న 20వ ఆసియా క్రీడల్లో(Asian Games) హర్మన్‌ప్రీత్ సింగ్, సలీమా టెటె సారథ్యంలోని జట్లు తమకు అచ్చొచ్చిన నీలంతోనే బరిలోకి దిగనుందని హాకీ ఇండియా వర్గాలు చెబుతున్నాయి.
భారత హాకీలో కాషాయం కథ ముగిసింది. ఆగస్టులో జరిగిన ఎఫ్ఐహెచ్ పురుషుల, మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో ఆరెంజ్ జెర్సీతో ఆడిన టీమిండియా.. ఈసారి సంప్రదాయ నీలం రంగుకే ఓటేయనుంది. జపాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడల్లో నీలం రంగు జెర్సీతోనే భారత పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగనున్నాయని సమాచారం. ఈ మెగా ఈవెంట్లో తొలి ప్రధాన్య కిట్ రంగుగా నీలం ఉండనుందని హాకీ ఇండియా తెలిపింది.
🚨 India’s Hockey teams are set to return to their traditional blue home kits at the Asian Games.
Hockey India listed blue as the first preference, with saffron as the secondary colour.
[ Via – @sportstarweb ] pic.twitter.com/oe2zuQ9x93
— The Khel India (@TheKhelIndia) September 8, 2026
‘ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల తొలి ప్రధాన్య కిట్‌గా దేన్ని ఎంచుకుంటారు? అని భారత ఒలిపింక్ సంఘం అడిగింది. అందుకు.. మేము నీలం అని చెప్పాం. రెండో ప్రధాన్య రంగుగా కాషాయాన్ని ఎంచుకున్నాం’ అని స్పోర్ట్స్ స్టార్‌తో హాకీ ఇండియా మీడియా ప్రతినిధి శేఖర్ మనోహరన్ వెల్లడించాడు. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ఆసియా క్రీడలు మొదలవ్వనున్నాయి. అక్టోబర్ 2న మహిళల హాకీ ఫైనల్, అక్టోబర్ 3న పురుషుల హాకీ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
There was plenty of furore over Hockey India’s (HI) decision to change its long-standing colour from blue to saffron, which the teams sported in the recently-concluded Hockey World Cup in the Netherlands and Belgium 🏆
But as the Indian teams head to Japan for the Asiad, HI has… pic.twitter.com/qZFrH9WiLg
— Sportstar (@sportstarweb) September 8, 2026