Screenplay Master Sukumar | కథన మాయాజాలాన్ని ఆవిష్కరించే ‘స్క్రీన్ప్లే మాస్టర్ సుకుమార్’
Screenplay Master Sukumar | డాక్టర్ ప్రవీణ్ యజ్జల రచించిన గ్రంథం 'స్క్రీన్ప్లే మాస్టర్ సుకుమార్’. కేవలం దర్శకుడు సుకుమార్ సినిమాల కథల గురించి కాకుండా ఆ కథల వెనుక ఉన్న బలమైన పునాదులను, ఆయన స్క్రీన్ ప్లే నిర్మాణంలోని మేధస్సును అత్యంత లోతుగా ఆవిష్కరిస్తుంది.
Screenplay Master Sukumar | మనిషి మెదడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి నిరంతరం కథలను ఆశ్రయిస్తుంది. సినిమా అనే అద్భుతమైన మాధ్యమం ద్వారా ప్రేక్షకుడి మెదడుతో ఆడుకునే మానసిక చదరంగాన్ని విశ్లేషిస్తూ వస్తున్న అరుదైన పుస్తకం ‘స్క్రీన్ప్లే మాస్టర్ సుకుమార్’. డాక్టర్ ప్రవీణ్ యజ్జల రచించిన ఈ గ్రంథం, కేవలం దర్శకుడు సుకుమార్ సినిమాల కథల గురించి కాకుండా ఆ కథల వెనుక ఉన్న బలమైన పునాదులను, ఆయన స్క్రీన్ ప్లే నిర్మాణంలోని మేధస్సును అత్యంత లోతుగా ఆవిష్కరిస్తుంది.
పాశ్చాత్య స్క్రీన్ ప్లే సిద్ధాంతకర్తలు రాబర్ట్ మెకీ, జాన్ ట్రూబీ వంటి వారి సూత్రాలను మన నేటివిటీకి, మట్టి వాసనకు సుకుమార్ ఎలా అద్భుతంగా అన్వయించారో ఈ పుస్తకం ఉదాహరణలతో చర్చిస్తుంది. ఆదర్శవంతమైన పాత్రలను కాకుండా, ఆత్మగౌరవ గాయాలున్న సహజమైన మనుషులను సృష్టించి వారి మానసిక సంఘర్షణ ద్వారా కథను నడిపించే సుకుమార్ శైలిని రచయిత ఇందులో అక్షరబద్ధం చేశారు. మేధోపరమైన చిక్కుముడులకు భావోద్వేగాలను జోడించి ఆయన చేసిన ప్రయోగాలు, పల్లెటూరి రాజకీయాలను ప్రపంచ స్థాయి కథన పద్ధతుల్లో మలిచిన తీరును ఈ పుస్తకం కళ్లకు కడుతుందన్నారు.


Read Also :
National Film Awards | ఢిల్లీకి వీడ్కోలు.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదికలో కీలక మార్పు!
Punjab Farmer: పంజాబ్లో డ్రగ్స్.. రైతు ఆత్మహత్యతో తీవ్ర దుమారం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

