Punjab Farmer: పంజాబ్‌లో డ్రగ్స్.. రైతు ఆత్మహత్యతో తీవ్ర దుమారం
Punjab Farmer: రైతు గుల్జార్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషపూరిత సల్ఫస్ను తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో పంజాబ్‌లో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్నది. డ్రగ్స్ మాఫియా గురించి ప్రశ్నించడం వల్లే ఆ రైతును వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
చండీఘడ్: పంజాబ్‌కు చెందిన 50 ఏళ్ల రైతు గుల్జార్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషపూరిత సల్ఫస్ను తీసుకుని అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో పంజాబ్‌లో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్నది. సంగ్రూర్ ఆస్పత్రిలో రైతు గుల్జార్ మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ఎక్కువైనట్లు ఇటీవల గుల్జార్ ఆరోపించారు. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఈవెంట్లో గుల్జార్ తన నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ అమ్మకాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. తన కుమారుడు డ్రగ్స్‌కు బానిసైనట్లు రైతు గుల్జార్ పేర్కొన్న ఓ వీడియో వైరల్ అయ్యింది. దీంతో అతనిపై పోలీసుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆ వేధింపులు తట్టుకోలేక రైతు గుల్జార్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల వేధింపుల వల్లే గుల్జార్ విషపూరిత పదార్ధాన్ని సేవించినట్లు తెలిసింది. లాథియానా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. అయితే ఈ కేసులో ఆ గ్రామ సర్పంచ్‌తో పాటు ఇద్దరు వ్యక్తులపై కేసు బుక్ చేశారు. వారి వేధింపుల వల్లే గుల్జార్ మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

