National Film Awards | ఢిల్లీకి వీడ్కోలు.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదికలో కీలక మార్పు!
National Film Awards | జాతీయ చలనచిత్ర అవార్డుల (నేషనల్ ఫిలిం అవార్డ్స్) ప్రదానోత్సవలా విషయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
National Film Awards | జాతీయ చలనచిత్ర అవార్డుల (నేషనల్ ఫిలిం అవార్డ్స్) ప్రదానోత్సవలా విషయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా ఎన్సీఆర్ పరిధిలోని ఢిల్లీకే పరిమితమైన ఈ వేడుకను ఇకపై ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని చాటేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని ఏక్తా నగర్లో (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంతం) నిర్వహించనున్నారు.
ఇప్పటివరకు ఈ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రదానం చేసేవారనే సాంప్రదాయానికి దీనితో తెరపడింది. ఈ ఏడాది జూలైలో ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా ‘ఆర్టికల్ 370’ నిలవగా, ఉత్తమ నటిగా యామీ గౌతమ్ ఎంపికయ్యారు. అలాగే మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకున్నారు. నాన్-ఫీచర్ విభాగంలో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – ఏక్ కా ప్రతీక్’ చిత్రానికి గాను ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకత్వ పురస్కారాన్ని దక్కించుకున్నారు. సెప్టెంబర్ 22న గుజరాత్లో జరగనున్న ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా పాల్గొని విజేతలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

