చరణ్‌రాజ్, శశాంక్బాలు, ప్రశాంతి ఏడే, బల్వీందర్ సింగ్, రంజిత్ నగెళ్లి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘లూసీ’. మహదేవ్ చిరంజీవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్ర పూజారి నిర్మాత. చిత్రీకరణ పూర్తిచేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకుంటున్నది.
ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో ఇదొక సరికొత్త ప్రయత్నమని, చదువుని కొనసాగిస్తూనే నిర్మాతగా కూడా రాణించాలన్నది తన లక్ష్యమని, భవిష్యత్తులో వరుస సినిమాలకు సన్నాహాలు చేస్తున్నానని నిర్మాత రాఘవేంద్ర పూజారి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: వియాన్ మ్యూజికల్, నిర్మాణ సంస్థ: సైన్మా స్టూడియోస్.