న్యూఢిల్లీ, జూలై 27: దాదాపు 576 మంది వ్యక్తులు 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లలో రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ స్థూల ఆదాయాన్ని ప్రకటించారని, ఇది గత ఐదేండ్లలో నాలుగు రెట్ల పెరుగుదల అని సోమవారం ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలియచేసింది.
దేశంలో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇందులో ప్రపంచంలోని అగ్రగామి దేశాలలో భారత్ ఒకటిగా ఉందనే విషయం ప్రభుత్వానికి తెలుసా అన్న ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ బిలియనీర్ అనే పదానికి ఆదాయ పన్ను చట్టం-1961 ప్రకారం నిర్వచనం ఏదీ లేదని తెలిపారు.