Srilanka Win: కివీస్‌పై 63 రన్స్ తేడాతో నెగ్గిన శ్రీలంక
Srilanka Win: తొలి టెస్టులో కివీస్‌పై శ్రీలంక విజయం సాధించింది. 63 రన్స్ తేడాతో గాలె టెస్టులో విక్టరీ కొట్టింది. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన అయిదు వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బతీశాడు.
గాలె: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక విజయం(Srilanka Win) సాధించింది. 63 రన్స్ తేడాతో గాలె టెస్టులో విక్టరీ కొట్టింది. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన అయిదు వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బతీశాడు. 275 రన్స్ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్.. కేవలం 211 రన్స్‌కు ఆలౌటైంది. ఇవాళ అయిదో రోజు ఆట ఆరంభమైన 15 నిమిషాల్లోనే చివరి రెండు వికెట్లను న్యూజిలాండ్ కోల్పోయింది. రచిన్ రవీంద్ర ఒంటరి పోరాటం చేసి 92 రన్స్ చేశాడు. సుడులు తిరుగుతున్న గాలె పిచ్‌పై కివీస్ బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో తడబడ్డారు. ఇదే పిచ్‌పై గురువారం రెండో టెస్టు ప్రారంభంకానున్నది.
స్కోరు బోర్డు
శ్రీలంక 305, 309
కివీస్ 340, 211
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

