Mahesh Babu | వరద బాధితుల సహాయార్థం (flood victims) పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి (Chief Ministers Relief Fund) విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, విశ్వక్సేన్, సాయిధరమ్ తేజ్ సహా పలువురు నటులు సీఎం సహాయ నిధికి తమ వంతు సాయం అందించిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూడా సీఎం సహాయ నిధికి విరాళం అందించారు.
మహేశ్ బాబు సోమవారం ఉదయం తన సతీమణి నమ్రతతో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎంను కలిసి వరద బాధితుల సహాయార్థం విరాళం అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల చెక్కును అందజేశారు. AMB తరపున మరో రూ.10లక్షలు విరాళంగా ఇచ్చారు.
Also Read..
Snake | రన్నింగ్ ట్రైన్లో పాము ప్రత్యక్షం.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వైరల్ వీడియో
PM Modi | గూగుల్ టు ఎన్విడియా.. 15 టాప్ టెక్ సీఈవోలతో ప్రధాని మోదీ రౌండ్ టేబుల్ సమావేశం