Parvati Nair | కోలీవుడ్ హీరోయిన్, ‘ది గోట్’ నటి (GOAT actor) పార్వతి నాయర్ (Parvati Nair)పై కేసు నమోదు అయ్యింది. పార్వతి నాయర్ ఇంట్లో పనిచేస్తున్న తనను దొంగతనం నెపంతో గదిలో బంధించి దాడి చేసినట్లు సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో హీరోయిన్ పార్వతి నాయర్, సహా మరో నలుగురిపై తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నటిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు బుక్ చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
సుభాష్ మొదట్లో కేజీఆర్ స్టూడియోస్‌లో సహాయకుడిగా పని చేసేవాడు. ఆ తర్వాత 2022 నుంచి పార్వతి నాయర్ నివాసంలో పని చేస్తున్నాడు. అయితే, తన ఇంట్లో ఖరీదైన వాచీలు, ల్యాప్‌టాప్‌లు, ఐఫోన్లు చోరీకి గురయ్యాని పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సుభాషే దొంగతనం చేశాడని ఆరోపించింది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ కేసులో సుభాష్‌ను పోలీసులు విడుదల చేశారు. దీంతో అతను కేజేఆర్ స్టూడియోస్‌లోనే తిరిగి పనిలోచేరారు.
అయితే, అక్కడ పనిచేస్తున్న తనను పార్వతి చెప్పుతో కొట్టిందని సుభాష్ ఆరోపించాడు. ఆమెతోపాటు మరో నలుగురు తనను దూషించారని తెలిపాడు. ఈ మేరకు నటిపై చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్ (Teynampet Police Station)లో ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో అతను సైదానెట్ 19 ఎంఎం కోర్టును ఆశ్రయించాడు. నటితో పాటు మరికొందరు దొంగతనం నెపంతో తనను వేధించారని వాపోయాడు. కేసును పరిశీలించిన సైదాపేట మెజిస్ట్రేట్ నటిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పార్వతి నాయర్, మరో నలుగురిపై తేనాంపేట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టారు.
కాగా, పార్వతి.. పాపిన్స్, స్టోరీ కథే, యెన్నై అరిందాల్, ఉత్తమ్ విలన్, నిమిర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక రణవీర్ సింగ్ 83లో చిత్రంలో కూడా పనిచేసింది. ఇక పార్వతి నాయర్ చివరిసారిగా దళపతి విజయ్ నటించిన ‘గోట్’ చిత్రంలో కనిపించింది.
Also Read..
Hari Hara Veera Mallu | విడుదల తేదీ ప్రకటించిన పవన్ ‘హరిహర వీరమల్లు’
Laapataa Ladies | ఆస్కార్‌కు కిరణ్ రావు ‘లాపతా లేడీస్’