e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home సిద్దిపేట అద్భుతంగా.. ఆహ్లాదకరంగా.. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ

అద్భుతంగా.. ఆహ్లాదకరంగా.. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ

అద్భుతంగా.. ఆహ్లాదకరంగా.. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ

గజ్వేల్‌ రూరల్‌, ఏప్రిల్‌ 1: గజ్వేల్‌ పట్టణ సమీపంలో ఒకే చోట నిర్మాణం జరుగుతున్న ఇండ్లు ఎం తో అద్భుతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో కనిపించడంతో వాటిని చూసేందుకు వచ్చే వారం తా ఎంతో సంతోషపడుతున్నారు. వందలాది ఎకరాల విస్తీర్ణంలో మోడల్‌ ఇండ్ల నిర్మాణం జరుగుతుండడంతో ఆ ప్రాంతం అంతా హైదరాబాద్‌ తర హా ప్రజలకు కనిపిస్తూ ఎంతో ఆకట్టుకుంటున్నది. ఒకే రకమైన ఇండ్ల నిర్మాణం జరుగుతుండడంతో అక్కడ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు ముందుగా ఆయా ముంపు గ్రామాల ప్రజలు చేప్పినట్లుగానే పనులు చేపడుతున్నారు. పనులు చివరి దశలో ఉండడంతో మురుగు కాల్వల నిర్మాణం, పూర్తయిన ఇండ్లను శుభ్రంగా కడిగి రంగులు వేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంటి నిర్మాణంతో పాటు ఖాళీ ప్రదేశం కలుపుకొని 250 గజాల స్థలాన్ని కేటాయిస్తున్నారు. ప్రతి రోజు ఏదో ఒక గ్రామానికి చెందిన ప్రజలు ఇండ్లను చూసుకునేందుకు అధికారులతో కలిసి ఆర్‌అండ్‌ఆర్‌కాలనీలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పల్లెపహాడ్‌ గ్రామస్తులు కాలనీలోని ఇండ్లను చూసి వెళ్లారు. కాలనీలో చకచకా వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణం, తారు, సీసీ రోడ్లు, భగీరథ నీటి కనెక్షన్‌, రంగులు వేయడం, కరెంట్‌ ఫిటింగ్‌ పనులు జరుగుతున్నాయి.

ఎర్రవల్లి గ్రామస్తులకు కేటాయింపు పూర్తి..
ముంపు గ్రామమైన కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామస్తులందరూ నాలుగు నెలలుగా జీ+2 ఇండ్లలో తాత్కాలికంగా ఉంటున్నారు. ముందుగా ముట్రాజ్‌పల్లి రోడ్డు మార్గంలోని ఇండ్లను వారికి కేటాయించడంతో గ్రామస్తులు, పెద్దల సమక్షంలో ఆయా కులాల వారీగా ఇండ్లను పంచుకున్నారు. డబుల్‌ బెడ్‌రూం వద్దన్న వారికి కాలనీలోనే 250 గజాల ఓపెన్‌ ప్లాట్లను ఇచ్చారు.

ఉగాది ముహూర్తం కోసం ఎదురుచూపులు
ఉగాది పండుగ రోజున ఎర్రవల్లి, సింగారం గ్రామస్తులు గృహప్రవేశాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటిలోగా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో వేగవంతగా పనులు పూర్తయ్యే విధంగా అధికారులు చూస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్‌లోనే ఉంటున్న ఎర్రవల్లి గ్రామస్తులను త్వరగా కొత్త ఇండ్లలోకి పంపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అదే సమయానికి మరికొన్ని గ్రామాలను కూడా ఇక్కడికి తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వారం రోజుల క్రితం తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్‌ గ్రామస్తులు 200మంది వరకు గృహప్రవేశాలు పూర్తి చేశారు. ఉగాది నాటికి కొత్త కాలనీ ముంపుగ్రామాల ప్రజలతో కళకళలాడుతుంది.

ఇవీ కూడా చదవండీ..

సిలిండర్‌ ధర రూ.10 తగ్గింపు

బట్టలు ఇస్త్రీ చేసిన తమిళనాడు మంత్రి జయకుమార్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అద్భుతంగా.. ఆహ్లాదకరంగా.. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ

ట్రెండింగ్‌

Advertisement