మెదక్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): మెదక్ ఎంపీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ గడువు గురువారం మూడు గంటలకు ముగిసింది. దీంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 23 మంది అభ్యర్థులు 36 నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం వరకు 54 మంది అభ్యర్థులు 90 నామినేషన్లను దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుందన్నారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుందని రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్ తెలిపారు.