రామచంద్రాపురం, ఏప్రిల్ 25: మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్‌లో ఆర్సీపురం, భారతీనగర్ డివిజనల్ల ముఖ్యకార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం లక్ష్మీగార్డెన్స్‌లో రెండు డివిజన్లకు సంబంధించి సన్నాహక సమాశం నిర్వహిస్తున్నామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
దశాబ్ద కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని గడపగడపకూ వివరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. పార్టీ నాయకులు బూతు స్థాయి నుంచి ప్రతి కార్యకర్తతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీ తీసుకురావాలని కార్పొరేటర్లు పుష్పానగేశ్, సింధూఆదర్శ్రెడ్డిలతోపాటు పార్టీ నాయకులకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు సఫానదేవ్, శంకర్‌యాదవ్, అంజయ్య, పరమేశ్, గోవింద్, ఐలేశ్, జగన్నాథ్‌రెడ్డి, బేకు యాదయ్య, అజీముద్దీన్, కృష్ణకాంత్, ప్రమోద్‌గౌడ్, బూన్, మల్లేశ్, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.