e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News Health : ఈ గ్యాడ్జెట్లు మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తాయి

Health : ఈ గ్యాడ్జెట్లు మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తాయి

‘ఇంట్లో ఉంటాయి. ఒంటినంటుకుంటాయి. లోలోపలి బాధలన్నీ చెప్పి మేలు చేస్తాయి. ఏమిటవి?’ రాబోయే తరానికి, కాబోయే పొడుపు కథ ఇది. సమాధానం.. స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ . అవును! అడవిలో పుట్టిన చీపురు తైతక్కలాడి ఇల్లు చక్కబెడితే గొప్పగా పొడుపు విప్పాం. స్మార్ట్‌ జంగిల్‌లో పుట్టిన గ్యాడ్జెట్స్‌ ఇంటినే కాదు, ఒంటినీ చక్కబెట్టేస్తున్నాయి. సెన్సర్‌తో ఓ కన్నేసి మరీ, ఆరోగ్యాన్ని కనిపెట్టుకుంటున్నాయి. అందుకే, ఈ స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ మనకు ‘మస్ట్‌’ అంటున్నది ఈ తరం.

Health : ఈ గ్యాడ్జెట్లు మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తాయి
‘స్మార్ట్‌'.. ఆరోగ్య‘మస్ట్‌'!

ఊపిరి తీరు చెప్పే మాస్క్‌

‘ఎయిర్‌పాప్‌ యాక్టివ్‌ ప్లస్‌ హాలో’ స్మార్ట్‌ మాస్క్‌ రకరకాల వ్యాధి కారకాలనుంచి రక్షణనిస్తుంది. దీన్ని ధరించడం వల్ల చర్మానికి ఎలాంటి హానీ ఉండదు. పైగా వాటర్‌ రెసిస్టెన్స్‌ కూడా! ఇందులోని ‘హాలో సెన్సర్‌’ మన శ్వాసరేటును ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఈ ‘స్మార్ట్‌ మాస్క్‌’ ఆపిల్‌ హెల్త్‌కిట్‌తో అనుసంధానమై పనిచేస్తుంది.

ధర: సుమారు రూ.11,300

‘స్మార్ట్‌'.. ఆరోగ్య‘మస్ట్‌'!

మెదడుకు చేయూత

‘మ్యూస్‌-2 బ్రెయిన్‌ సెన్సింగ్‌ హెడ్‌బ్యాండ్‌’ను ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా సరే తలకు ధరించవచ్చు. ఈ ‘హెడ్‌బ్యాండ్‌ మైండ్‌’ ఒకే విషయంపై ఫోకస్డ్‌గా ఉండేలా చేస్తుంది. దీన్ని స్మార్ట్‌ ఫోన్‌కు కనెక్ట్‌ చేస్తే, ధ్యానం సమయంలో మనసు, శరీరానికి సంబంధించిన సంకేతాలపై ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుంది.

ధర: సుమారు రూ.15,650

‘స్మార్ట్‌'.. ఆరోగ్య‘మస్ట్‌'!

కిర్రాక్‌ మిర్రర్‌

మామూలుగా జిమ్‌లో ఎక్కడ చూసినా నిలువెత్తు అద్దాలు ఉంటాయి. వ్యాయామం చేసేవారు, వాటిలో తమను చూసుకుంటూ ఇన్‌స్పైర్‌ అవుతూ వర్కవుట్లు చేస్తుంటారు. అదే నిలువెత్తు ‘స్మార్ట్‌ మిర్రర్‌’ ఎదురుగా ఉంటే, ఆన్‌లైన్‌ వర్కవుట్‌ పాఠాలు వింటూ సాధన కొనసాగించవచ్చు. అందుకే, వర్కవుట్‌ మిర్రర్స్‌కు డిమాండ్‌ పెరుగుతున్నది. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ‘ఇస్పో’ వారి ‘వాహీ మిర్రర్‌’ ఇలాంటిదే. ఈ మిర్రర్‌ను ఎదురుగా ఉంచుకుని సాధన చేయవచ్చు. ఫిట్‌నెస్‌ ట్రైనర్లతో ఇంటరాక్ట్‌ కావచ్చు. వీడియో కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. న్యూట్రిషనిస్ట్‌ కన్సల్టేషన్లూ తీసుకోవచ్చు. నిలువెత్తు అద్దం సాక్షిగా ఫిట్‌నెస్‌ పెంచుకోవచ్చు.

ధర: సుమారు రూ.2 లక్షలు

‘స్మార్ట్‌'.. ఆరోగ్య‘మస్ట్‌'!

ప్రతీ ‘క్షణం’ ఆరోగ్యంగా..

స్మార్ట్‌ వాచీల వల్ల ప్రయోజనాలు ఎన్నున్నా.. అలంకారానికి అనువుగా లేకపోవడం ఓ అసంతృప్తే. ఈ లోటును తీరుస్తూ ‘స్టీల్‌ హెచ్‌ఆర్‌ మ్యారీస్‌ కంపెనీ’ అందమైన స్మార్ట్‌ వాచీలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ ‘హైబ్రిడ్‌ స్మార్ట్‌వాచీ’ ఆకర్షణీయమైన లుక్‌తో, ఆరోగ్య సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తుంది. మన హార్ట్‌ రేట్‌, స్టెప్స్‌ కౌంట్‌ లెక్కగడుతుంది. వివిధరకాల వ్యాయామాల మధ్య వ్యత్యాసాలను కనిపెడుతూ ఉంటుంది. అంతేకాదు, నిద్రలో నాణ్యతను గుర్తించి, కలత నిద్ర పోతుంటే హెచ్చరిస్తుంది. రెగ్యులర్‌ స్లీపింగ్‌ అవర్స్‌ ఆధారంగా.. అలారమ్‌ మోగించి సుప్రభాతం పలుకుతుంది. ‘హెల్త్‌మేట్‌’ యాప్‌తో అనుసంధానమయ్యే ఈ స్మార్ట్‌ వాచ్‌ ఆరోగ్య సాధనలో అనుక్షణం సహకరిస్తుంది.

ధర: సుమారు రూ.13,500

‘స్మార్ట్‌'.. ఆరోగ్య‘మస్ట్‌'!

మే(లు) జోళ్లు

‘పామ్‌ ఎన్‌ఆర్‌జీ మసాజ్‌ సాక్స్‌’ ఇప్పుడో ట్రెండ్‌. ముఖ్యంగా పాదాల నొప్పితో బాధ పడుతున్న వారికి ఈ మేజోళ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ సాక్సుల జతలో ‘ఎన్‌ఆర్‌జీ-2’ అనే ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని అమర్చారు. దాంతో ఇవి ‘ట్రాన్స్‌క్యుటేనియస్‌ ఎలక్ట్రికల్‌ నర్వ్‌ స్టిమ్యులేషన్‌’ (టీఈఎన్‌ఎస్‌) టెక్నిక్‌ సాయంతో నొప్పిగా ఉన్న కండరాలకు ఎలక్ట్రికల్‌ పల్సులను పంపుతాయి. దానివల్ల ఎలాంటి మందులూ లేకుండానే దీర్ఘకాలిక నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.

ధర: సుమారు రూ.11,100

‘స్మార్ట్‌'.. ఆరోగ్య‘మస్ట్‌'!

చిటికెలో శుద్ధజలం

కొవిడ్‌ వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ అందరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. తినే, తాగే విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉపయోగపడే వస్తువే ‘సెల్ఫ్‌ క్లీనింగ్‌ వాటర్‌ బాటిల్‌’. లార్క్‌ కంపెనీ వారు తయారు చేసిన ఈ బాటిల్‌లో ‘నాన్‌ టాక్సిక్‌ యూవీ-సి ఎల్‌ఈడీ లైట్‌ టెక్నాలజీ’ని ఉపయోగించారు. అది బాటిల్‌ నీళ్లలో ఎలాంటి వైరస్‌, బ్యాక్టీరియా ఉన్నా వెంటనే హరించి వేస్తుంది. ప్రతి బాటిల్‌కి ఒక క్విక్‌ క్లీన్‌ బటన్‌ ఉంటుంది. ఇందులోని ‘సెల్ఫ్‌ క్లియరింగ్‌ సెట్టింగ్‌’ అనే ఫీచర్‌ దానంతటదే రెండు గంటలకోసారి యాక్టివేట్‌ అయిపోయి, యూవీ-సి ఎల్‌ఈడీ లైట్‌ద్వారా బాటిల్‌లోని నీళ్లను శుభ్రపరుస్తుంది. కోల్డ్‌ అండ్‌ హాట్‌ డ్రింక్స్‌కూ దీనిని ఉపయోగించవచ్చు.

ధర: సుమారు రూ. 8,800

‘స్మార్ట్‌'.. ఆరోగ్య‘మస్ట్‌'!

లుక్‌ ఎట్‌ లాకెట్‌

ఒంటిమీది స్మార్ట్‌ హెల్త్‌ డివైజ్‌లు బయటికి కనిపిస్తే ఇబ్బంది పడతారు కొంతమంది. కానీ, ఆరోగ్య ఉపకరణం ఆభరణ రూపంలో అందుబాటులోకి వస్తే ఎవరు మాత్రం కాదంటారు? ఆకు ఆకారంలో ఉండే ఈ లాకెట్‌, పక్కా స్మార్ట్‌ డివైజ్‌ అని చెబితేగానీ ఎవరూ కనిపెట్టలేరు. ఈ లాకెట్‌ నిద్రలో నాణ్యతను పసిగడుతుంది. అలాగే, రోజువారీ శారీరక శ్రమనూ కనిపెడుతుంది. గర్భిణి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. దీన్ని బెల్లాబీట్‌ యాప్‌తో కనెక్ట్‌ చేస్తే మెనుస్ట్రువల్‌ సైకిల్‌ (రుతుచక్రం) నుంచి ఒవల్యూషన్‌ డేట్స్‌ వరకు వివరంగా తెలుపుతుంది. తల్లి కావాలనుకునేవారికి ఇలాంటి పరికరం ఎంతో ఉపయోగకరం.

ధర: సుమారు రూ. 7,380

‘స్మార్ట్‌'.. ఆరోగ్య‘మస్ట్‌'!

సేఫ్‌ ఫోన్‌

ముఖానికి మాస్క్‌తో చేతులకు శానిటైజర్‌తో కొవిడ్‌ జాగ్రత్తలు బాగానే తీసుకుంటున్నారు. అయితే, 24 గంటలు చేతిలో ఉండే ఫోన్‌ సంగతేమిటి? దాన్ని ఆఫీస్‌ గోడలపై, ఇంట్లో కిచెన్‌, బాత్‌రూముల్లో ఎక్కడెక్కడో పెడుతుంటాం. మరి, అలాంటి ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకోకపోతే వైరస్‌ అంటుకోకుండా ఉంటుందా? అందుకే, ఫోన్లను శానిటైజ్‌ చేసే గ్యాడ్జెట్‌ వచ్చేసింది. అదే ‘యూవీ లైట్‌ స్టెరిలైజేషన్‌ కేస్‌’. గంటకోసారి ఫోన్‌ని ఆ కేస్‌లో పెడితే చాలు, అందులోని ‘యూవీ లైట్‌’ సూక్ష్మక్రిములు, వైరస్‌లను ఐదు నిమిషాల్లో సర్వనాశనం చేస్తుంది. ఇది చేత్తో పట్టుకునేంత ఉంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.

ధర: సుమారు రూ.5,815

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

డ్రైవింగ్‌ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ

ఏప్రిల్‌లో భారత్‌లో విడుదలయ్యే టాప్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

ప్ర‌తి 5 నిమిషాల‌కూ మీ మొబైల్ డేటాను సేక‌రిస్తున్న గూగుల్‌, ఆపిల్

పాముల్లా మనుషులు విషాన్ని చిమ్ముతారా?

ఈ ఫోన్ల‌లో ఇక వాట్సాప్ ప‌నిచేయ‌దు

యూట్యూబ్ ట్యాక్స్.. అస‌లేంటిది? ఇండియ‌న్స్‌పై ప్ర‌భావం ఎంత‌?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Health : ఈ గ్యాడ్జెట్లు మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తాయి

ట్రెండింగ్‌

Advertisement