మణికొండ, ఏప్రిల్ 20: వారం రోజులుగా మణికొండ పాత గ్రామంలో కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పదిరోజులుగా మురుగునీరు సరఫరా చేస్తున్నారని స్థానిక ప్రజలు జలమండలిశాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని వాపోతున్నారు. ఆంధ్రాబ్యాంకు సర్కిల్ నుంచి మర్రిచెట్టు సర్కిల్ వరకు మంచినీటి పైప్లైన్ ద్వారా మురుగు నీళ్లు వస్తున్నాయని, జలమండలి అధికారులు సమాచారం ఇచ్చినట్లు స్థానిక మాజీ వార్డు సభ్యులు చిల్కూరి బీరప్ప తెలిపారు.