ఈ ఫోన్లలో ఇక వాట్సాప్ పనిచేయదు

మీరు పాత ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ వాడుతున్నారా! అయితే వెంటనే అప్డేట్ అవ్వండి!! లేదంటే మీ మొబైల్లో ఇక వాట్సాప్ ఏ మాత్రం పనిచేయదు. మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు వాట్సాప్ అప్డేట్స్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వ్యక్తిగత గోప్యత కోసం ఇప్పటికే ఎన్క్రిప్టెడ్ చాటింగ్ అందుబాటులోకి తెచ్చింది. ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం మరిన్ని అప్డేట్స్ తీసుకొస్తున్న వాట్సాప్ ఇకపై పాత ఫోన్లలో తమ సేవలను నిలిపివేయాలని భావిస్తోంది. త్వరలోనే ఈ ఫోన్లలో వాట్సాప్ తమ సేవలను నిలిపివేసే అవకాశం ఉంది.
ఏ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు
– ప్రస్తుతం ఐఓఎస్‌లో వాట్సాప్ 2.21.50 వెర్షన్ అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు ఐఫోన్ 4S వాడుతున్నట్లయితే ఇది మీ యాప్ స్టోర్‌లో కనిపించదు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటే ఐఫోన్ 4S తర్వాత మొబైల్స్ ఉండాలి.
– అదే ఐఫోన్ 5 దాని తర్వాత మోడల్స్ ఉపయోగించినట్లయితే మీ ఐఓఎస్10కు అప్డేట్ చేసుకోవాలి. ఐఓఎస్ 9 దానికంటే ముందు ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్) ఉంటే మీ మొబైల్లో వాట్సాప్ సేవలను నిలిచిపోయే అవకాశం ఉంది.
– ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో అయితే 4.0.3 ఓఎస్ కంటే ముందు ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. అంటే శాంసంగ్ గ్యాలక్సీ జడ్ ఫ్లిప్, శాంసంగ్ గ్యాలక్సీ నోట్ 10.1, శాంసంగ్ గ్యాలక్సీ నెక్సస్, హెచ్‌టీసీ వన్ వీ, హెచ్‌టీసీ డిసైర్ సీ, హెచ్‌టీసీ డిసైర్ ఎస్, సోనీ ఎక్స్‌పీరియా టేబుల్ ఎస్, సోనీ ఎక్స్‌పీరియా నియో సహా పలు ఫోన్లలో ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0.3 అంతకంటే పాత వర్షన్ ఓఎస్ ఉంది. కాబట్టి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.
– KaiOS 2.5.1అంతకంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఫోన్లలో మాత్రమే వాట్సాప్ పనిచేస్తుంది. ఈ ఓఎస్ జియో ఫోన్, జియో ఫోన్2లో ఉంది.
మీ మొబైల్ ఓఎస్ వర్షన్ ఇలా తెలుసుకోండి
– ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నట్లయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎబౌట్ ఫోన్‌పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
– ఐఫోన్ వాడుతున్నట్లయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్‌పై క్లిక్ చేస్తే ఎబౌట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఫోన్ వివరాలు తెలుస్తాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో మాజీ కంటెస్టెంట్ల సందడి.. నరేష్‌కు సన్నీ సపోర్ట్ , వెక్కి వెక్కి ఏడ్చిన వర్షిణి!
Asia Cup Rising Stars | భారత్ ఖేల్‌ఖతం.. సెమీస్‌లోనే ఓడిన తిలక్సేన
Gold Price | పసిడి పయనమెటు.. ఈ ఏడాది రూ.55,500 డౌన్.. ఇప్పుడు కొనాలా.. వేచి చూడాలా?
Delimitation Bill | డీలిమిటేషన్‌కు రంగం సిద్ధం.. 30 నుంచి లోక్‌సభ, 2 నుంచి రాజ్యసభ సమావేశాలు
Indiramma Bima | ఇంటి పన్ను కడితేనే ఇందిరమ్మ బీమా.. ములుగు జిల్లా వాజేడులో అధికారుల ఆదేశాలు!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

