తెలుపు చీరలో ఏ కాంత అయినా దేవకాంతను తలపిస్తుంది. అదే చీరకు ముత్యాలు, ఎంబ్రాయిడరీ నగిషీలూ అద్దితే.. అందానికే అందం. ధవళవర్ణపు ఆర్గంజా సిల్కు వస్త్రం మీద పువ్వులు ఎంబ్రాయిడరీ జోడించిన ఈ చీరను అర్చనారావ్ డిజైన్ చేశారు. కట్‌వర్క్ అంచు రిచ్ లుక్ తీసుకొచ్చింది. రాళ్లూపూసలతో వచ్చిన హై నెక్ జాకెట్ చీరకు కొత్త అందాన్ని తెచ్చింది. ధర రూ.52 వేలు. perniaspopupshop.com లో ఖరీదు చేయవచ్చు.
కళాత్మకంగా తీర్చిదిద్దితే.. చెవిదుద్దులు కూడా చూడచక్కని చిత్రంలా కనువిందు చేస్తాయి. అలాంటి అరుదైన చెవిపోగుల తయారీలో పేరుగాంచారు డిజైనర్ శచీ షా. ఇటీవల మైక్రోమొజాయిక్ తరహాలో చెర్రీబ్లాసమ్ పూలను హ్యాండ్ పెయింటింగ్‌తో ఆవిష్కరించారు. పద్దెనిమిది క్యారెట్ల బంగారంతో చుట్టూ వజ్రాలు పొదిగి మరీ వీటిని రూపొందించారు. పై భాగంలో పక్షులు, పువ్వులను నాజూకైన డిజైన్‌తో బంగారంతో తయారు చేశారు. ఆ సంస్థ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ shacheefinejewelry_ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.
Hand Bag
ఫ్యాషన్ సరుకుల్లో కాటన్ బ్యాగులు ఎప్పుడూ ముందే ఉంటాయి. అచ్చమైన ట్రెండీ డ్రెస్‌లకు అసలైన మ్యాచింగ్ అనిపిస్తాయి. అందుకే సమ్మర్ ైస్టెల్స్లోనూ వీటిది ప్రత్యేక స్థానమే. నీలిరంగు కలనేతగా ఇక్కడ కనిపిస్తున్న బ్యాగూ అదే కోవలోనిది. మైషా సంస్థ షేడ్స్ ఆఫ్ బ్లూ టొటే బ్యాగ్ పేరిట దీన్ని తయారుచేసింది. ఈ అచ్చమైన నూలు బ్యాగ్‌ను మూసి ఉంచేందుకు మ్యాగ్నటిక్ బటన్ ఉంటుంది. కాటన్ దారాలను మెలితిప్పి ముడివేసిన హ్యాండిల్ ప్రత్యేక లుక్‌తో కనిపిస్తుంది. సింపుల్‌గా ఉన్నా, ఫ్యాషన్‌గానూ అనిపించే ఈ సంచిని maishalifestyle.com ద్వారా కొనుగోలు చేయవచ్చు. ధర రూ.1,299.
సుఖాసీనులు కండి… అన్న పదం వాడుతూ ఉంటాం. సౌకర్యవంతంగా కూర్చోమన్న అర్థంలో దీన్ని ప్రయోగిస్తాం. నిజానికి కుర్చీకి ఉండాల్సిన మొదటి లక్షణం సౌకర్యమే. దానికి చిరునామా లిసా చెయిర్ అంటున్నది తయారీ సంస్థ.. నమ హోమ్. ద లిసా చెయిర్ పేరిటమార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ కుర్చీ సరికొత్తగా కనిపించడమే కాదు, దీని కుషన్లు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. హాయిగా కూర్చునేందుకు ఉపకరిస్తాయి. ఇక, బంగారు వన్నెలో వచ్చిన మెటాలిక్ బాడీ, రింగుల డిజైన్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. మొత్తానికి మాడ్రన్ కలెక్షన్‌ను ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక. namahome.in లో బుక్ చేసుకోవచ్చు. ఖరీదు 30 వేల రూపాయలు మాత్రమే.
ఆహార్యంలో దుస్తులతోపాటు చెప్పులూ భాగమే. అందుకే బ్రాండెడ్ బట్టలకు దీటుగా విలాసవంతమైన చెప్పుల తయారీ సంస్థ క్రిస్టియన్ లాబోటిన్ వీటిని తయారుచేసింది. అద్దంలా మెరిసేలా లెదర్‌ను మెరుగుపెట్టారు తయారీదారులు. మెటాలిక్ ఎఫెక్ట్‌తో పైన స్ట్రాప్ వచ్చిన హైహీల్స్ ఇవి. ధర లక్ష రూపాయల పైమాటే. నచ్చితే Net-a-parter.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.
“Naya Mall | సన్ గ్లాసెస్ విత్ ఉడెన్ టచ్.. అదిరిపోయిన లేటెస్ట్ గ్యాడ్జెట్”
“Naya Mall |ఈ స్మార్ట్ రింగ్ మీ హార్ట్ రేట్ కూడా చెప్పేస్తుంది”