Naya Mall | సన్ గ్లాసెస్ విత్ ఉడెన్ టచ్.. అదిరిపోయిన లేటెస్ట్ గ్యాడ్జెట్
Naya Mall | ఎండాకాలం బయటికి వెళితే కాలిజోళ్లు ఎంత అవసరమో చలువ కళ్లజోళ్లూ అంతే అవసరం. సమ్మర్ వెకేషన్ అంటూ మండేఎండల్లో ట్రిప్పులకు వెళ్లేవాళ్లకయితే ఇవి అలంకారంలా కనిపించే అత్యవసరాలు కూడా. వాటినే ఇప్పుడు పర్యావరణ హితంగా రూపొందిస్తున్నారు డిజైనర్లు.
Naya Mall |చలువ జోళ్లు చెక్కతో
ఎండాకాలం బయటికి వెళితే కాలిజోళ్లు ఎంత అవసరమో చలువ కళ్లజోళ్లూ అంతే అవసరం. సమ్మర్ వెకేషన్ అంటూ మండేఎండల్లో ట్రిప్పులకు వెళ్లేవాళ్లకయితే ఇవి అలంకారంలా కనిపించే అత్యవసరాలు కూడా. వాటినే ఇప్పుడు పర్యావరణ హితంగా రూపొందిస్తున్నారు డిజైనర్లు. మలాక్కా ఉడెన్ సన్‌గ్లాసెస్… పేరిట రూపొందించిన ఈ చలువ కళ్లద్దాల ఫ్రేములు చెక్కతో తయారవుతున్నాయి. అమెరికన్ వాల్నట్ ఉడ్‌తో చేసిన దీని అద్దాలు గులాబీ ఆకుపచ్చ రంగుల కలబోతగా కనిపిస్తాయి. పెద్దసైజులో స్టైల్ ఐకాన్‌లా కనిపించే వీటి ధర రూ. 4,400. brownliving.in వెబ్సైట్ ద్వారా ఖరీదు చేయవచ్చు.

Scarf
స్కార్ఫ్ కట్టినట్టు
వేసవిలో చాలా అడుగులు బీచ్వైపే పడతాయి. సముద్రపు అలల మీదుగా వచ్చే చల్లగాలిని ఆస్వాదిస్తూ ఎండ వేడిమిని మర్చిపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ధరించేందుకు ప్రత్యేకించి బీచ్ డ్రెస్సులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఫ్యాషన్ సంస్థ గువాపా ఈ కోవకు చెందిన సరికొత్త టాప్‌ను రూపొందించింది. రంగుల పూల ప్రింట్లతో అచ్చం స్కార్ఫ్ కట్టుకున్నట్లు కనిపిస్తుందీ పొడవాటి బ్యాక్‌లెస్ టాప్. ‘జార్డిన్ స్కార్ఫ్ బ్యాండో టాప్’గా పిలుస్తున్న దీన్ని శాటిన్‌తో తయారు చేశారు. పాండిచ్చేరి సముద్ర తీరానికి ఈ డ్రెస్ ప్రేమలేఖలాంటిదని చెబుతారు డిజైనర్లు. guaparesortwear.com క్లిక్ చేసి.. నచ్చిన మోడల్ ఎంచుకోవచ్చు. ధర రూ. 5,500.

ప్యాచ్‌వర్క్ బూట్లు
అతివల చీరలు, ఆడపిల్లల డ్రెస్సులకే ప్యాచ్ వర్కులు ఉండాలా… రెండు విభిన్న అందాల కలబోతగా కనిపించే దీన్ని ఫ్యాషన్‌కు పేరైనా బూట్లలో వాడకూడదా… అని అనుకున్నారేమో డిజైనర్లు… స్నీకర్స్నూ ప్యాచ్‌వర్క్‌తో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ప్రముఖ బూట్ల తయారీ సంస్థ వ్యాన్స్ ‘బ్రొకేడ్ క్లాసిక్ స్లిప్ ఆన్ షూస్’ పేరిట రూపొందించిన ఈ బూట్ల మీద పూల బ్రొకేడ్ ఫ్యాబ్రిక్‌తో ప్యాచ్‌వర్క్ చేశారు. తెలుపు నలుపు రంగుల కలబోతగా తయారైన ఈ రెండు బూట్లూ ఒకదానికొకటి కాస్త విభిన్నంగా కనిపిస్తూ ైస్టెలిష్లుక్ని తెచ్చిపెడతాయి. నడిచేప్పుడు మంచి గ్రిప్ ఉండేలా వేఫర్ రబ్బర్ సోల్ వాడారు.. farfetch.com వెబ్సైట్లో దొరుకుతాయీ స్నీకర్స్. ధర సుమారు రూ.12 వేలు.

Hand Bag
పక్కా డిజైనర్
ఫ్యాషన్ దుస్తులు, యాక్సెసరీలంటే ఎవరికైనా మోజే. వీటి ఎంపికలో మోడల్‌కి ఎంత ప్రాధాన్యమిస్తారో, బ్రాండ్లకు అంతకు మించి విలువనిస్తారు. ఇంకోమెట్టు ముందుకెళ్లే వాళ్లయితే డిజైనర్లు తయారు చేసినవాటికే తమ ఓటు అంటూ డిజైనర్ వస్తువుల మీద మోజు తెలుపుతుంటారు. ఇక్కడ కనిపిస్తున్న హ్యాండ్ బ్యాగ్ అలాంటిదే. ‘ఫూల్ చాదర్ బ్రొకేడ్ కేస్బ్యాగ్’ పేరిట సెలెబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహ్లియాని దీన్ని రూపొందించారు. ఎరుపు రంగు పర్సు మీద బ్రొకేడ్ డిజైన్, రంగురంగుల పూసలు, ఎంబ్రాయిడరీతో రూపొందిన ఈ కేస్ బ్యాగ్ ధర రూ.14,900. నచ్చితే ensembleindia.com వెబ్సైట్లో ఆర్డర్ చేయవచ్చు.
Read More :
“Naya Mall |ఈ స్మార్ట్ రింగ్ మీ హార్ట్ రేట్ కూడా చెప్పేస్తుంది”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

