naya mall | వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై వర్క్ చేస్తూనే వర్కవుట్స్ చేసుకోవచ్చు
naya mall | వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యమాని ల్యాప్‌టాప్ ఒళ్లో పెట్టుకుని కూర్చుంటే గంటలు గంటలు కదిలే పరిస్థితే లేదు. అలాంటి వాళ్ల కోసమే ప్రత్యేకించి ‘ఎకినెక్ట్ బీడీ 3 బైక్' పేరిట వర్క్ డెస్క్ తయారుచేసింది ఏసర్ సంస్థ.
సైక్లింగ్ చేస్తూ.. పని చేయండి!
ఇప్పుడంతా స్మార్ట్ యుగం. ఎవరు ఏ పనిచేయాలన్నా కంప్యూటర్లోనే. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యమాని ల్యాప్‌టాప్ ఒళ్లో పెట్టుకుని కూర్చుంటే గంటలు గంటలు కదిలే పరిస్థితే లేదు. అలాంటి వాళ్ల కోసమే ప్రత్యేకించి ‘ఎకినెక్ట్ బీడీ 3 బైక్’ పేరిట వర్క్ డెస్క్ తయారుచేసింది ఏసర్ సంస్థ. ఇందులో కూర్చునేందుకు, ల్యాప్‌టాప్ పెట్టుకుని పనిచేసుకునేందుకు ఏర్పాట్లు ఉంటాయి. తొక్కేందుకు వీలుగా కాళ్ల దగ్గర పెడల్స్ ఉంటాయి. మనం సైకిల్ తొక్కుతూ ఉంటే పవర్ ఉత్పత్తి అవుతుంది. దాంతో ల్యాప్‌టాప్ చార్జింగ్ అవుతూ ఉంటుంది. మొబైల్ ఫోన్‌నూ దీంతో చార్జ్ చేసుకోవచ్చు. బ్యాగ్ తగిలించుకునేందుకు, కాఫీ కప్పుల్లాంటివి పెట్టుకునేందుకు ప్రత్యేకంగా చోటు ఉంది. ఈ డెస్కు ధర రూ.81,000.

వరిపొట్టు కప్పులివి..
మట్టి టీ కప్పులను మనం చూసే ఉంటాం. కానీ ప్రస్తుతం పునర్వినియోగ శకం నడుస్తున్నది. పాత వస్తువులతో కొత్త ఉత్పత్తిని అందించడం ఇందులో ప్రత్యేకత. అలాగే, ఇప్పుడు కప్పుల కోసం నేలను తవ్వి మట్టిని తీయకుండా. వ్యవసాయ వ్యర్థాలైన వరిపొట్టు లాంటి వాటితో తయారు చేస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. లాంటి వివిధ ఆన్లైన్ సంస్థలు వీటిని అమ్ముతున్నాయి. కప్పు సైజును బట్టి రూ.400 నుంచి 700 దాకా ధర పలుకుతున్నాయి. ఖరీదుగానే అనిపించినా నేల తల్లికి ఇవి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు తయారీదారులు.

ముత్యమంటి పాదాలకు..
డ్రెస్సింగ్ ఎంత ఫ్యాషనబుల్‌గా ఉన్నా వాటికి తగ్గ చెప్పులు తోడైతేనే అలంకరణ పర్ఫెక్ట్గా పూర్తయినట్టు. అందుకే చాలామంది దుస్తుల మీద ఎంత శ్రద్ధ పెడతారో పాదరక్షల మీదా అంతే దృష్టి పెడతారు. అలాంటి వారికోసమే ‘జిమ్మీ కూ’ సంస్థ ముత్యాల పాదరక్షలు మార్కెట్లోకి తెచ్చింది. లేత బంగారు రంగు శాటిన్‌తో చేసిన ఈ చెప్పుల మీద ఆర్టిఫీషియల్ ముత్యాలు, క్రిస్టల్స్ పట్టీలా ఉంటాయి. లోపలి వైపు లెదర్‌తో తయారుచేశారు. ఈ ‘మేడ్ ఇన్ ఇటలీ’ చెప్పుల ధర సుమారు 52 వేల రూపాయలు.

ఎల్లిగడ్డ.. ఉల్లిపాయ.. ఉప్పు.. మిరియం
ఎల్లిగడ్డ, ఉల్లిపాయ.. ఊసులేనిదే రోజు గడవదు చాలా మందికి. ఇక లేటెస్ట్ వంటకాలకు అదనపు రుచులు అద్దేందుకు ప్రతి డైనింగ్ టేబుల్ మీదా సాల్ట్ పెప్పర్ డబ్బాలు తప్పక ఉంటున్నాయి. ఈ రెండిటి కలగలుపుగా ఉప్పు, మిరియాల పొడి వేసుకునే డబ్బాలనే వెల్లుల్లిపాయ, ఉల్లిగడ్డల ఆకృతుల్లో తీర్చిదిద్దారు
డిజైనర్లు. ఆ పింగాణీ పాత్రల అడుగున ఉప్పు లేదా మిరియాల పొడి వేసుకునేందుకు వీలుగా మూతలు ఉంటాయి. పెట్టుకోవడానికి చిన్న ట్రే కూడా వస్తుంది. ఆన్లైన్లో ధర 500 నుంచి 700 రూపాయల దాకా ఉంది. రేటింగ్ చూసుకుని ఆర్డరు పెట్టుకోవడమే.
Read More :
“Naya Mall | కళ్ల కింద చారలతో వయసు పైబడినట్టు కనిపిస్తున్నారా? మీకోసమే ఈ ట్రిక్”
“Naya mall | ఈ పవర్‌బ్యాంక్ 30 నిమిషాల్లోనే మొబైల్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తుందట !”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

