Naya mall | షుగర్ ఉన్నవాళ్లకు ఈ డివైజ్ ఎంత బెటర్ తెలుసా
Naya mall | మధుమేహ రోగుల ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. శరీరంలో చక్కెర స్థాయులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. వాటిని నియంత్రించేందుకు తక్షణం ఇన్సులిన్ అందించాల్సి ఉంటుంది.
Naya mall | మీ వెంటే.. మందులూ
మధుమేహ రోగుల ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. శరీరంలో చక్కెర స్థాయులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. వాటిని నియంత్రించేందుకు తక్షణం ఇన్సులిన్ అందించాల్సి ఉంటుంది. అలాంటి అత్యవసర ఔషధాల్ని వెంట తీసుకువెళ్లేందుకు వీలుగా వచ్చేసింది.. ఇన్సులికూల్. గోద్రెజ్ సంస్థ తయారు చేసిన ఈ పరికరం 1.6 కిలోల బరువు ఉంటుంది. చార్జింగ్‌తో పనిచేస్తుంది. దీంట్లో 0.56 లీటర్ల ఔషధాలను నిల్వచేయవచ్చు. అడ్వాన్స్డ్ థర్మోఎలక్ట్రానిక్ కూలింగ్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసే మందులను దీంట్లో పెట్టుకుని తీసుకెళ్లే వీలుంది. ఆన్లైన్ ధర రూ. 5,999. godrej.comలో పూర్తి వివరాలు చూడవచ్చు.

కలిసి ఆస్వాదించేలా..
సంగీతం చెవులకూ, మనసుకూ ఆహ్లాదాన్ని పంచుతుంది. చాలామంది చక్కని సంగీతం, సాహిత్యం మేళవించిన పాటలను ఇష్టపడతారు. అలాంటి వారికోసమే సరికొత్త బ్లూటూత్ స్పీకర్‌ను తీసుకొచ్చింది.. ఆడియో టెక్నికా సంస్థ. ఈ స్పీకర్‌ను ఫోన్‌తో కనెక్ట్ చేసుకుని నచ్చిన పాటలు వినవచ్చు. యూఎస్బీ కనెక్టర్‌తో పెన్‌డ్రైవ్, మెమరీ కార్డును కూడా జతచేయవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే 12 గంటలపాటు అలరిస్తుంది. ఈ స్పీకర్లో ఒకప్పటి గ్రామఫోనులా వినైల్ రికార్డులను కూడా ఆస్వాదించవచ్చు. పిక్నిక్లకు, వేడుకలకు అనువైన ఈ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ ఆన్లైన్ ధర రూ. 16,400. కొనాలనుకుంటే audio-technica.com చూడవచ్చు.

రంగ్‌దే బసంతీ!
ఒక్కొక్కరు ఒక్కో రంగును ఇష్టపడతారు. తాము ధరించే దుస్తులు, వాడే వస్తువులు అదే వర్ణంలో ఉండేలా చూసుకుంటారు. ఇప్పుడు ఇంట్లోనూ నచ్చే కాంతులు వెదజల్లే లైట్లను అమర్చుకోవచ్చు. ఐసిరెర్ సంస్థ ఆవిష్కరణతో ఇది సాధ్యమైంది. ఈ స్మార్ట్ బల్బులను ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని.. కోరిన రంగుపై క్లిక్ చేస్తే చాలు. మిశ్రమ వర్ణాలనూ ఎంచుకునే వీలుంది. అంతేకాదు, దీనిలోని బ్లూటూత్ స్పీకర్ సాయంతో ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని పాటలు కూడా వినవచ్చు. ఇంద్రధనుస్సులా రంగురంగుల కాంతిని వెదజల్లే ఈ స్మార్ట్ బల్బు ఆన్లైన్ ధర రూ. 3,900. aisirer.com మీద క్లిక్ చేసి ఆ రంగుల ప్రపంచంలో ప్రవేశించండి.

స్మార్ట్‌గా..స్టైల్‌గా!
వాచీ ధరించడం ఓ స్టేటస్ సింబల్. అందుకే రకరకాల ఫీచర్స్, వైవిధ్యమైన లుక్స్‌తో స్టైలిష్‌గా రూపొందిస్తున్నాయి తయారీ సంస్థలు. అన్నట్టు, సమ్మిట్-3 పేరుతో సరికొత్త సిరీస్‌ను విడుదల చేసింది.. మాంట్బ్లాంక్. టైటానియం కేస్‌తో లగ్జరీలుక్లో మెరిసిపోయే ఈ స్మార్ట్ కమ్ ైస్టెలిష్ వాచీలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసే సెన్సర్లు, ఫిట్నెస్, పేమెంట్స్ యాప్స్ జోడించారు. లాంగ్‌లైఫ్ బ్యాటరీ ఈ వాచీ ప్రత్యేకత. ఆన్లైన్ ధర రూ. 1,05,000. మీరూ ఈ ైస్టెలిష్ వాచీ ధరించాలనుకుంటే.. montblanc.com సందర్శించవచ్చు.
Read More :
“Naya Mall | ఈ ఛార్జర్‌తో మీ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టడమే కాదు శానిటైజ్ కూడా చేయొచ్చు”
Naya Mall | లగేజ్ సూట్కేస్తోనే ఇక స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

