Naya Mall | బ్యాటరీ ఎక్కువసేపు రావాలా? అయితే మొబైల్‌కు ఈ కూలర్ వాడండి
Naya Mall | ఫోనుకో ఫ్యాన్! చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ హస్తభూషణంగా మారిపోయింది మొబైల్‌ఫోన్. చాటింగ్, గేమింగ్ అంటూ నిత్యం ఫోన్లోనే ఉంటున్నారు. అయితే ఎంత మంచి ఫోన్ అయినా.. నిరంతరం వాడటం వల్ల బ్యాటరీ సామర్థ్యం, పనితీరు తగ్గే అవకాశం లేకపోలేదు.
Naya Mall | ఫోనుకో ఫ్యాన్!
చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ హస్తభూషణంగా మారిపోయింది మొబైల్‌ఫోన్. చాటింగ్, గేమింగ్ అంటూ నిత్యం ఫోన్లోనే ఉంటున్నారు. అయితే ఎంత మంచి ఫోన్ అయినా.. నిరంతరం వాడటం వల్ల బ్యాటరీ సామర్థ్యం, పనితీరు తగ్గే అవకాశం లేకపోలేదు. కొన్ని ఫోన్ల బ్యాటరీలైతే కాసేపటికే వేడెక్కిపోతాయి. అలాంటి వాటిని కూల్ చేసి నిరంతరాయంగా పనిచేయించగలదు.. వన్‌ప్లస్ మొబైల్ కూలర్. ఈ కూలర్‌ను ఫోన్‌కు జతచేస్తే చాలు బ్యాటరీ వేడి కాకుండా చూస్తుంది. 18 వాట్స్ సామర్థ్యం గల ఈ చిట్టి కూలర్ క్షణాల్లో ఫోన్‌ను చల్లబరచడమే కాదు, బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ మొబైల్ కూలర్ ఆన్లైన్ ధర రూ.3,299. మీ ఫోన్‌కూ దీన్ని జత చేయాలని అనుకుంటే oneplus.com చూడవచ్చు.

మరింత స్మార్ట్‌గా..
చాలామంది స్మార్ట్ వాచీలు వాడుతున్నారు. ఇవి రకరకాల ఫీచర్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా గూగుల్ సంస్థ ఓ సరికొత్త వాచ్‌ను రూపొందించింది. ఈ స్మార్ట్ యుగంలో ఏ సమాచారం కావాలన్నా వెంటనే గుర్తుకొచ్చేది గూగుల్. ఫోన్లో అందరికీ అందుబాటులో ఉండే గూగుల్ ఇప్పుడు వాచీలోకీ వచ్చేసింది. దీంట్లో మ్యూజిక్, మెయిల్, మ్యాప్, వ్యాలెట్ పేమెంట్స్‌తోపాటు హార్ట్‌బీట్, పల్స్ వంటి ఫీచర్స్‌ను కూడా జతచేసింది గూగుల్. అంతేకాదు దీంట్లో ఫిట్నెస్ బిట్స్, డైట్టిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాయిస్ కమాండ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ వాచీ ధర రూ. 28,850. పూర్తి వివరాలు store.google.comలో చూడవచ్చు.

గుడ్ మార్నింగ్
ఉదయం లేవగానే బ్రష్ చేసుకోవాలంటే చాలామందికి బద్ధకం. ఇక పిల్లలతో పళ్లు తోమించడం మహాకష్టం. అలాంటి ఇబ్బందేం లేకుండా.. చకచకా పళ్లు తోమేందుకు వచ్చేసింది ఓరల్ బి ఐజీరో8 టూత్‌బ్రష్. బ్యాటరీతో పనిచేసే ఈ బ్రష్ పళ్లను శుభ్రంగా తోమడంతోపాటు పళ్ల మధ్య ఇరుక్కున్న పదార్థాలను కూడా వదలగొడుతుంది. పళ్లు తెల్లగా మెరిసిపోయేందుకు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. ఈ స్మార్ట్ బ్రష్‌ను ఫోన్‌కు అనుసంధానం చేసి దంతాల ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఈ బ్రష్ ధర రూ. 12,450.

అదిరిపోయే క్వాలిటీ..
ప్రస్తుతం హెడ్‌ఫోన్స్ వాడకం పెరిగిపోయింది. బ్లూటూత్, ఇయర్‌పాడ్స్ అంటూ రకరకాల ఫీచర్స్‌తో కొత్తకొత్త హెడ్‌ఫోన్స్ వస్తున్నాయి. ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీ సంస్థ సోని సరికొత్త హెడ్‌ఫోన్స్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు.. 30 గంటలకు పైగా పనిచేస్తాయి. గూగుల్, సిరి వాయిస్ అసిస్టెంట్స్తోనూ అనుసంధానం అవుతాయి. ఈ హెడ్‌ఫోన్స్‌ను సోనీ హెడ్‌ఫోన్స్ కనెక్ట్ యాప్‌తో లింక్ చేసి వాయిస్ కమాండ్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. ఆన్లైన్ ధర రూ. 34,990. వివరాలకు sony.co.in.
Read More :
“ఈ సైకిల్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 70 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

