Naya Mall | ఈ షవర్ కింద స్నానం చేస్తే జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయంట !!
Naya Mall | జల్లుల స్నానం కోసం
చక్కగా స్నానం చేస్తే చాలు, ఎంతటి అలసట అయినా ఇట్టే ఎగిరిపోతుంది. అయితే పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం, చర్మం పొడిబారడం తదితర సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. వాటికి చెక్ పెట్టేదే ఈ ఐకానిక్ షవర్ హెడ్. ఆక్వాప్యూర్ సంస్థ రూపొందించిన ఈ షవర్లో మూడు రకాల మినరల్ బీడ్స్ ద్వారా నీళ్లు శుద్ధి అవుతాయి. దాంతో క్లోరిన్, ఇతర హానికర కారకాలు తొలగిపోతాయి. ఈ మూడు రకాల బీడ్స్‌ను ఉంచేందుకు షవర్ హెడ్లో మూడు ప్రత్యేక అరలు ఉంటాయి. వీటి ద్వారా వచ్చే నీళ్లు సువాసనను, స్వచ్ఛతను కలిగి ఉంటాయి. దాంతో జుట్టు రాలడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు తలెత్తవు. ఈ బీడ్స్ విడిగానూ అందుబాటులో ఉన్నాయి. ఈ షవర్ హెడ్ ఆన్లైన్ ధర రూ. 2,400. పూర్తి వివరాలకు aquapure.com చూడవచ్చు.

మాసిన ఫ్యాషన్
తెల్లగా ఉతికి, ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవడం ఒకప్పటి ఫ్యాషన్. చిరిగిన, మాసిన బట్టలు తొడుక్కోవడం నేటి ఫ్యాషన్. ఎంత చిరిగితే అంత ధర. ఈ ట్రెండ్‌కి సరిపోయేలా ‘డర్టీ స్నీకర్స్’ పేరుతో మాసిన షూస్‌ను తీసుకొచ్చింది ప్రముఖ పాదరక్షల తయారీ కంపెనీ గుచ్చీ. డబ్భులనాటి ఆటగాళ్ల షూస్ స్ఫూర్తితో వీటిని రూపొందించారు. తయారీకి కాస్త మాసిన రంగులను ఎంచుకున్నారు. వాటిపై మరకల్లా ప్యాచ్‌లు జోడించారు. అన్ని సైజుల్లోనూ అందుబాటులో ఉన్న వీటి ఆన్లైన్ ధర సుమారు రూ. 70,000. పూర్తి వివరాలకు gucci.com చూడవచ్చు.

అడుగేస్తే.. గొడుగు!
వర్షకాలంలో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఎండగా ఉందిలే అని బయటికి వెళ్తే అప్పటికప్పుడు పెద్ద వర్షం పడవచ్చు. అందుకే ఈ సీజన్ మొత్తం ఓ గొడుగును వెంట ఉంచుకుంటారు చాలామంది. హడావుడిలో చేతిలోని గొడుగును ఎక్కడో పెట్టి మర్చిపోయే వారూ లేకపోలేదు. ఇక ఆ భయం అక్కర్లేదు. ఎక్కడ మర్చిపోయినా పిలిచి మరీ గుర్తుచేస్తుంది ఈ స్మార్ట్ గొడుగు. దీనికి జీపీఎస్ ట్రాకర్ అనుసంధానమై ఉంటుంది. యాప్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేస్తే చాలు.. ఎక్కడైనా మర్చిపోయినా మెసేజ్, కాల్ ద్వారా హెచ్చరిస్తుంది. అంతేకాదు వాతావరణం ఎలా ఉందన్నదీ అంచనా వేస్తుంది. మరికాసేపట్లో వర్షం పడబోతున్న విషయాన్నీ గుర్తుచేస్తుంది. వెరీ స్మార్ట్ కదూ! దీని ఆన్లైన్ ధర రూ.4,800. పూర్తి వివరాలకు coolthings.com చూడవచ్చు.

కంటికి కాస్త మర్దన
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ పనిచేస్తూనే ఉంటాయి మన కళ్లు. మనం నిద్రలోకి జారుకున్నాకే వాటికి విశ్రాంతి. కంప్యూటర్లు, ఫోన్ల కారణంగా ఆ చిటారి తలుపులపై భారం మరింత ఎక్కువైంది. అందుకే చిన్నాపెద్దా తేడాలేకుండా కళ్లకింద వలయాలు, వాపులు వచ్చేస్తున్నాయి. ఆ ఒత్తిడి నుంచి ఉపశమనానికి నేత్ర మర్దన ఓ మంచిమార్గం. సున్నితమైన మసాజ్ శరీరంలోని అన్ని భాగాలకూ హాయిని ఇచ్చినట్టే కళ్లకూ మేలుచేస్తుంది. దీనికోసం ఫోరియో కంటి మసాజర్‌ను రూపొందించింది. దీంతో కళ్ల కింద, రెప్పల మీద సున్నితంగా ఓ 30 సెకన్లపాటు రుద్దితే ఆ ప్రాంతంలోని కణాలు ప్రేరేపితం అవుతాయి. తద్వారా కళ్ల కింద వలయాలు, వాపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ పరికరం ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ఆన్లైన్ ధర రూ. 12,000. వివరాలకు foreo.com చూడవచ్చు.
Read More :
“చిన్న పిల్లలతో బయటకు వెళ్తున్నారా? అయితే ఈ డివైజ్ మీకోసమే..”
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

