చిన్న పిల్లలతో బయటకు వెళ్తున్నారా? అయితే ఈ డివైజ్ మీకోసమే..
Naya Mall | బుజ్జి పాపాయి కోసం..
చిన్నపిల్లలతో ప్రయాణం అంటే మాటలు కాదు. వాళ్లకు పాలు కలపాలన్నా వేడినీళ్లు కావాల్సిందే. ఎంత ఫ్లాస్క్‌లో పోసినా ఒకటి, రెండుసార్లకంటే ఎక్కువ రావు. ఆ ఇబ్బంది లేకుండా.. బుజ్జి పాపాయి బొజ్జకు వేడివేడి ఆహారాన్ని అందించేందుకు వచ్చేసింది ‘బీబా బిబ్ ఎక్స్‌ప్రెస్సో’. ఈ చిట్టి మైక్రోవేవ్ కప్‌తో పిల్లలకు కావాల్సిన పాలు, నీళ్లు, ఆహారం తేలిగ్గా వేడిచేసుకోవచ్చు. చార్జింగ్‌తో పనిచేసే ఈ పరికరం 30 సెకెన్లలో ఆహారాన్ని 37 డిగ్రీల వరకూ వేడిచేయగలదు. ఈ కప్ సాయంతో పాల బాటిళ్లను కూడా స్టెరిలైజ్ చేయవచ్చు. దీని ఆన్లైన్ ధర రూ.10,999. పూర్తి వివరాలకు allthingsbaby.com చూడవచ్చు.

కాఫీ చల్లారితే ఒట్టే
ప్రయాణాల్లో టీ, కాఫీలు దొరకడమే కష్టం. ఒకవేళ దొరికినా మనకు కావాల్సినంత వేడిగా ఉండవు. ఆరిపోయిన కాఫీ తాగడం అంతగా ఇష్టపడరు చాలామంది. అలాంటి వారికోసమే ఓ చక్కని స్మార్ట్ కప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది ‘ఎంబర్’. చార్జింగ్ ప్లేట్ జతగా వచ్చే ఈ కప్‌లో కాఫీ మూడు గంటల వరకూ వేడిగానే ఉంటుంది. ఈ స్మార్ట్ కప్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ‘కాఫీ ఎంత వేడిగా ఉంది?’ అనే విషయాన్నీ చెక్ చేసుకోవచ్చు, ఎంత వేడిగా ఉండాలన్నదీ సెట్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ కప్ ఆన్లైన్ ధర రూ. 15,840. వివరాలకు ember.com చూడవచ్చు.

సోలార్ బ్యాగ్!
ఎక్కడికెళ్లాలన్నా ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ తప్పనిసరి. కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలతో ‘లో బ్యాటరీ’ తలనొప్పి ఎప్పుడైనా ఉండేదే. ప్రయాణాల్లో చార్జింగ్ పాయింట్‌ను వెతుక్కునే పనిలేకుండా, గ్యాడ్జెట్స్ పోతాయనే భయంలేకుండా కూర్చున్న చోటే చార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా వచ్చిందే.. ఆరే సోలార్ బ్యాక్‌పాక్. ల్యాప్‌టాప్ స్పెషల్‌గా రూపొందించిన ఈ బ్యాగ్ 24,000 ఎంఏహెచ్ విద్యుత్ నిల్వ సామర్థ్యం ఉన్న బ్యాటరీని కలిగి ఉంటుంది. సోలార్ పవర్‌తో రీచార్జ్ అయ్యే ఈ బ్యాటరీతో.. సీ టైప్ యూఎస్బీ పోర్ట్ సాయంతో ఫోన్, లాప్‌ట్యాప్‌లను చార్జ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్‌ప్యాక్ ఇరవై కిలోల బరువు మోయగలదు. దీన్ని రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్‌తో తయారుచేశారు. ఆన్లైన్ ధర సుమారు రూ. 19,720. పూర్తి వివరాలకు Voltaicsystems.com చూడవచ్చు.

చెక్క అందాలు
చేతి బ్యాగులంటే మగువలకు మహా ఇష్టం. అందుకే మార్కెట్లో రకరకాల కొత్త బ్యాగులు దర్శనమిస్తున్నాయి. మామూలు లెదర్ బ్యాగులతో పోలిస్తే.. హస్తకళలు నింపుకొన్న అందమైన బ్యాగులదే ఇప్పుడు హవా. చెక్కపైన చక్కని ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ వర్క్ చేసిన బ్యాగులను రూపొందించింది.. ఆర్ట్ఫ్లైక్ సంస్థ. అందమైన పక్షులు, పూలు, ఆకులతో కూడిన డిజైన్లలో పొదిగిన పూసలు, రాళ్లు ఈ బ్యాగులకు మరింత అందాన్ని ఇస్తున్నాయి. సన్నని గొలుసుల్ని జతచేసిన స్లింగ్ బ్యాగులే కాకుండా అందంగా చేతిలో అమరిపోయే క్లచ్‌లను కూడా తీసుకొచ్చింది. ఆన్లైన్ ప్రారంభ ధర రూ. 1,500. వివరాలకు artlyck.com చూడవచ్చు.
Read More :
“Hair Mask | ఇది మీ జుట్టుకు మాస్క్‌లాంటిది.. చుండ్రు సమస్యను ఇట్టే తగ్గిస్తుంది”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

