Naya Mall | ఎవరికైనా మతిమరుపు సహజమే. రిమోట్లు, తాళం చెవులు, ఫోన్, చార్జర్, పర్సు.. ఎక్కడో పెట్టి మరచిపోతుంటాం. దీంతో టెన్షన్! ఇల్లుపీకి పందిరేస్తాం. ఎప్పటికో దొరుకుతాయి. ఆ ఇబ్బందులేం లేకుండా వచ్చేసింది.. ‘టైల్(tile)’ స్మార్ట్ ట్రాకర్. అంగుళం పరిమాణంలో ఉండే ఈ బుజ్జి ట్రాకర్ ఆయా వస్తువులు ఇంట్లో ఏ మూలనున్నా ఇట్టే చెప్పేస్తుంది. చేయాల్సిందల్లా ఈ ట్రాకర్‌ను ఆ వస్తువులకు అతికించి, టైల్ యాప్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవడమే. వస్తువులే కాదు ఇంట్లో పెంచుకునే పిల్లులు, కుక్కపిల్లలు తప్పిపోయినా కనిపెట్టేస్తుంది. ఈ స్మార్ట్ ట్రాకర్ ఆన్లైన్ ధర రూ.8,790 (రెండు ట్రాకర్స్).
షూ అంటే రెండూ ఒకేలా ఉంటాయి. వాటి మీద ఏ ప్రింట్ డిజైనో ఉంటుంది. కానీ బూట్ల మీద రంగు నీళ్లు చల్లినట్టూ, కుంచెతో గీసినట్టూ.. రెండూ వేటికవే కనిపిస్తాయి గ్రాఫిటీ బూట్లు. వాటిలో మరో జతను సరికొత్తగా ముందుకు తీసుకొచ్చింది సెవెన్ టు టెన్ సంస్థ. ర్యాండమైజ్డ్ ప్రింట్ కటింగ్ టెక్నిక్ ఆధారంగా ఈ బూట్లను భిన్నమైన డిజైన్‌తో చేశారు. అందుకే ఒకటి పసుపు -నలుపు-నీలాల మిశ్రమం అయితే, మరోటి నారింజ-నలుపు-నీలాల సమ్మేళనంలా కనిపిస్తుంది. మార్కెట్లో వీటి ధర రూ.5,999.
ఎండ ప్రభావం మిగతా భాగాలకంటే కళ్లమీదే ఎక్కువ. కాంతి తీవ్రత కాస్త ఎక్కువైనా, తక్కువైనా నేత్రాలకు అలసట తప్పదు. అయితే, సన్గాడ్ సంస్థ ప్రవేశపెట్టిన సరికొత్త అల్ట్రా గ్లాసెస్‌తో ఎంత తీవ్రమైన కాంతినైనా కంటికి చేరకుండా ఆపేయవచ్చు. కంటికి అవసరమైనంత కాంతి మాత్రమే అందేలా ఆధునికమైన లెన్స్ జతచేసిన ఈ కళ్లజోడు క్రీడాకారులకు మరింత ఉపయోగకరం. స్టైలిష్ లుక్‌తో మెరిసిపోయే ఈ కళ్లజోడు రకరకాల రంగుల్లో అందుబాటులో ఉంది. పూర్తిగా రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారైన దీని ఆన్లైన్ ధర రూ.12,700. వివరాలకు sungod.co చూడవచ్చు.
చక్కని ఫ్రేమ్‌లో ఫొటోలు తీయాలంటే నానాపాట్ల్లూ పడాల్సిందే. తీరా చూస్తే ఆ ఫొటోల్లో మనం మిస్సవుతాం. కానీ కెనన్ రూపొందించిన పవర్‌షాట్ పీఎక్స్తో అందరూ కలిసే ఫొటోలు దిగొచ్చు. టిల్ట్ లెన్స్, వాయిస్ కమాండ్ సౌకర్యం ఉన్న ఈ కెమెరా చక్కని ఫొటోలను తీయడమే కాదు.. వాటిని స్టోర్ చేస్తుంది, షేర్ చేస్తుంది కూడా. యూఎస్బీ పోర్ట్‌తో నేరుగా ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌తో కనెక్ట్ చేసుకుని వైర్లెస్ వెబ్ కెమెరాగానూ వాడుకోవచ్చు. దీని ఆన్లైన్ ధర రూ.41,000. పూర్తి వివరాలకు: canon-europe.comలో చూడవచ్చు.
అలసిన శరీరం శక్తిని పుంజుకోవాలంటే టీ బ్రేక్ కావాల్సిందే. మంచి మసాలా టీ అయితే మరీ మంచిది. ఇందుకోసమే ప్రముఖ తేయాకు తయారీ సంస్థ ‘వహ్దమ్ ఇండియా(Vahdam India)’ ఓ స్పెషల్ గిఫ్ట్ హాంపర్ను విడుదల చేసింది. ఈ గిఫ్ట్ బాక్స్‌లో మనదేశంలో లభించే మేలైన మసాలాలను జోడించి తయారుచేసిన ఇండియాస్ ఒరిజినల్ మసాలా చాయ్, ఆర్గానిక్ హిమాలయన్ గ్రీన్ టీ, ఇంగ్లిష్ బ్రేక్‌ఫాస్ట్ బ్లాక్ టీ, ఎర్ల్ గ్రే బ్లాక్ టీ.. అనే నాలుగు రకాల స్పెషల్ టీ పౌడర్లు ఉన్నాయి. ఈ గిఫ్ట్‌ప్యాక్ ఆన్లైన్ ధర రూ.799.
“Naya Mall | ఈ సూట్‌కేస్‌తో ఫోన్ చార్జింగ్ పెట్టుకోవచ్చు.. పాటలు వినొచ్చు”