ఇక మీ ఇంటి తాళాన్ని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా లాక్ చేయొచ్చు
Naya Mall – Smart Lock స్మార్ట్ లాక్
ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు హడావుడిలో తాళం వేయడం మరిచిపోయామంటే అంతే సంగతులు.. తిరిగి ఇల్లు చేరేంతవరకూ ఏమీ తోచదు. ఆ భయమేం లేకుండా స్మార్ట్ లాక్‌ను అందుబాటులోకి తెచ్చింది హాఫెల్(Hafele) సంస్థ. ఈ స్మార్ట్ లాక్‌తో ఎక్కడి నుంచి అయినా డోర్ లాక్ చేయవచ్చు, అన్‌లాక్ చేయవచ్చు. పాస్‌కోడ్ పెట్టుకుని కీపాడ్తోనూ, ఫింగర్ ప్రింట్‌తోనూ ఓపెన్ చేయవచ్చు. యాప్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంటే ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా.. ప్రధాన ద్వారం మీద ఓ కన్నేసి ఉంచవచ్చు. ఈ స్మార్ట్ లాక్ ఆన్లైన్ ధర రూ.65,979. మరిన్ని వివరాలకు hafeleindia.com.

తరగని మెరుపు
ధగధగ మెరిసే వజ్రాల నగల్ని చూస్తే.. మహిళల కళ్లూ మెరుస్తాయి. కాకపోతే ఆ ధరలను చూసి కొనేందుకు వెనుకాడతారు. ప్రముఖ జువెలరీ డిజైనర్ ‘గ్లిట్స్ & గ్లామర్’ వైటల్ కలెక్షన్ పేరుతో సరికొత్త డిజైనర్ వజ్రాల నగల్ని మార్కెట్లో విడుదల చేసింది. రోజూవారీ అలంకరణకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఆభరణాలు కార్పొరేట్ నారీమణుల హృదయావిష్కరణ కూడా. వీటిలో ‘స్నగ్గీ డిజైన్స్’ పేరుతో వచ్చిన వజ్రాల ఇయర్ రింగ్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి. ఆన్లైన్లో వీటి ఆరంభ ధర రూ.53,000.

స్మైల్ ప్లీజ్.. ఫొటోలు చకచకా
ప్రతి జ్ఞాపకాన్నీ ఫొటోలో బంధించడం అందరికీ అలవాటైపోయింది. కాకపోతే, ఒకటే లోటు. ఆ ఫొటోలో మనం కనిపించం. ఆ ఇబ్బంది లేకుండా, స్నాప్ పిక్సీ డ్రోన్ కెమెరా చకచకా ఫొటోలు తీస్తుంది. ఈ రెక్కల కెమెరా ఫోన్‌కు అనుసంధానమై ఉంటుంది. తీసిన ప్రతి ఫొటో తప్పక సేవ్ అవుతుంది. నీళ్లలో తేలుతూ, గాల్లో ఎగురుతూ ఫొటోలు దిగడానికి, రకరకాల భంగిమల్లో మొబైల్‌తో సెల్ఫీలు తీసుకోడానికి ఇబ్బందే ఉండదు. ఈ పిక్సీ డ్రోన్ కెమెరా ఆన్లైన్ ధర రూ. 17,600. వివరాలకు pixy.com.

నిత్య దీపావళి
బైకర్ టేబుల్ ల్యాంప్.. ఇత్తడితో చేసిన ఆధునిక టేబుల్ ల్యాంప్. నున్నని డోమ్, బాటిల్ లాంటి బేస్‌తో చూసేందుకు అందంగానూ, ఆకర్షణీయంగానూ ఉంటుంది. దీన్ని కావలసినంత ఎత్తుకు అమర్చుకునే వీలుంది. ఆన్లైన్ ధర రూ.13,995. పూర్తి వివరాలకు cuckooland.com చూడవచ్చు.
Read More :
Urbanista | ఈ హెడ్‌ఫోన్స్‌కు లైఫ్ టైమ్ చార్జింగ్ పెట్టాల్సిన పనే లేదు !!”
Naya Mall | దీంతో మసాజ్ చేస్తే ముడతలు తగ్గుతాయంట.. ధర ఎంతో తెలుసా!!”
“Naya Mall | ఈ ఒక్క బాటిల్ ఉంటే ఫ్రిజ్, వాటర్ ఫిల్టర్ ఏవీ అక్కర్లేవు”
Naya Mall | ఈ బాటిల్లో ఎంత మురికి నీళ్లు పోసినా.. ఫిల్టర్ నీళ్లలా మారిపోతాయి”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Jewelry
- lamp
- Naya mall
- smart lock
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

